EPAPER

Mining:-మైనింగ్ వేస్ట్‌తో కాంక్రీట్.. మరింత ధృడంగా..

Mining:-మైనింగ్ వేస్ట్‌తో కాంక్రీట్.. మరింత ధృడంగా..

Mining:- ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు కచ్చితంగా అందులో ఎంతోకొంత శాతం చెత్త రూపంలో వేస్ట్ అవుతూ ఉంటుంది. కానీ అలాంటి చెత్తను కూడా ఉపయోగకరంగా మార్చుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే ఎంతో గ్లోబల్ వేస్ట్‌ను ఉపయోగకరంగా మార్చి ప్రజలకు అందించిన వారు.. ఇప్పుడు మైనింగ్ వేస్ట్‌పై దృష్టిపెట్టారు. అంతే కాకుండా మైనింగ్ వేస్ట్‌ను ఉపయోగకరంగా మార్చేందుకు వారికి భారీ పెట్టుబడి కూడా అందింది.


నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ లేబురేటరీ (ఎన్ఆర్ఈఎల్).. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీతో కలిసి మూడేళ్లకు ఒక ఒప్పందాన్ని సిద్ధం చేసుకుంది. వారు ఒప్పందం చేసుకున్న ప్రాజెక్ట్ విలువ 4.38 మిలియన్ డాలర్లు. ఈ ప్రాజెక్ట్‌లో మైనింగ్ వేస్ట్‌ను ధృడమైన కాంక్రీట్‌గా మార్చాలని పరిశోధకులు అనుకుంటున్నారు. ఇప్పటకే మైనింగ్ వేస్ట్‌తో కాంక్రీట్ తయారీ సాధ్యమవుతుందని తెలిసినా.. ఈ విభాగంలో పూర్తిస్థాయి పరిశోధనలు జరగలేదు. అమెరికా వేసిన ఈ ముందండుగు ఇంకా ఎన్నో ఇతర దేశాలను ఆలోచనలో పడేలా చేయనుంది.

ఈ ప్రాజెక్ట్‌లో ఎన్ఆర్ఈఎల్‌కు తోడుగా మరెన్నో ఇతర సంస్థలు కూడా భాగంకానున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఉపయోగించేది కేవలం రెన్యూవబుల్ ఎనర్జీ అయ్యిండాలని వారు అనుకుంటున్నారు. దానికోసమే సన్నాహాలు చేస్తున్నారు కూడా. మైనింగ్ వేస్ట్ మెటీరియల్స్‌, కార్బన్ డయాక్సైడ్ మధ్య రియాక్షన్స్‌ చేయడానికి ఎంతో ఎనర్జీ అవసరం పడుతుంది. అందుకోసమే రెన్యూవబుల్ ఎనర్జీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వాటి రియాక్షన్స్ వల్ల డోలోమైట్ లాంటి మెటీరియల్స్ తయారవుతాయి. ఆ తర్వాత వాటిని కాంక్రీటుగా మార్చవచ్చు.


మైనింగ్ వేస్ట్‌లో ఉండే కార్బన్ డయాక్సైడ్‌ను బయటికి వెళ్లనివ్వకుండా కాంక్రీట్ రూపం తయారవుతుంది కాబట్టి దీని వల్ల పర్యావరణానికి కూడా ప్రమాదం లేదని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ప్రక్రియను మినరలైజేషన్ అంటారు. ప్రస్తుతం ఈ ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నో ప్రపంచ దేశాలు సైతం మైనింగ్ వేస్ట్‌తో కాంక్రీట్‌ను తయారు చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాయని పరిశోధకులు బయటపెట్టారు. కట్టడాల వల్ల అమెరికాలో కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ ఎక్కువగా జరుగుతుంది. కానీ మైనింగ్ వేస్ట్ వల్ల అలాంటి ప్రమాదాలు ఏమీ ఉండవని ఆ ప్రభుత్వం ఇలాంటి పరిశోధనలకు సపోర్ట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

ఆకాశాన్ని కమ్మేస్తున్న శాటిలైట్లు.. ప్రమాదాల హెచ్చరిక..

for more updates follow this link:-bigtv

Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×