Big Stories

Chatbots : చాట్‌బోట్స్‌కు మెడికల్ ఇంటర్వ్యూ..

Chatbots

Chatbots : ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో తయారు చేసిన చాట్‌బోట్స్ అనేవి టెక్నాలజీ రంగంలో కొత్త ఊపును, ఉత్సాహాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతీ రంగంలో కస్టమర్లకు సహాయంగా ఉంటూ.. ఇక మనుషులతో పనిలేదు అనిపించేలా చేస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్న చాట్‌బోట్స్.. ఇప్పుడు మెడికల్ రంగంపై కూడా దృష్టిపెట్టాయి. తాజాగా మెడికల్ రంగంలోకి అడుగుపెట్టడానికి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యింది చాట్‌బోట్.

- Advertisement -

ఈరోజుల్లో మనుషులు శారీరికంగా ఎన్ని సమస్యలను ఎదుర్కుంటున్నారో.. మానసికంగా కూడా అంతే సమస్యలను ఎదుర్కుంటున్నారు. అందుకే థెరపీల కోసం డాక్టర్ల దగ్గర క్యూ కడుతున్నారు. థెరపీ డాక్టర్ల కోసం వస్తున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకే చాట్‌బోట్స్‌ను కూడా ఈ రంగంలోకి దించాలని శాస్త్రవేత్తలు అనుకున్నారు. ఈ విషయంలో చాట్‌బోట్స్ సక్సెస్ అయ్యాయి కూడా. కానీ మెడికల్ రంగంలో మనిషి సాయం లేకుండా చాట్‌బోట్స్‌ను పూర్తిగా నమ్మలేమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

మెడికల్ రంగంలో పేషెంట్లకు సాయంగా ఉండడం కోసం చాట్‌బోట్స్‌కు ప్రత్యేకమైన ట్రైనింగ్‌ను అందిస్తారు. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ట్రైనింగ్ తర్వాత కొత్తగా ఏర్పడిన ఆరోగ్య సమస్య గురించి చాట్‌బోట్స్‌కు ఎలాంటి అవగాహన ఉండదు. ట్రైనింగ్‌లో చెప్పిన అంశాలు తప్పా వేరే అంశాల గురించి చికిత్స అందించే అవకాశం లేదు. ఇలాంటివన్నీ పేషెంట్లకు సమస్యలు తెచ్చిపెడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

తాజాగా పలువురు స్పెషలిస్ట్స్ కలిసి చాట్‌బోట్స్‌ను ఇంటర్వ్యూ చేశారు. వీరంతా పలు విభాగాల్లో స్పెషలిస్ట్‌లుగా పనిచేస్తున్నారు. అంతే కాకుండా చాట్‌బోట్స్‌కు మెడికల్ స్కూల్‌లో అడ్మిషన్ దొరికేలాగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అంతే కాకుండా ఇతర విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో చాట్‌బోట్స్ సాయంగా ఉండేలా ట్రైన్ చేస్తున్నారు. కొంతమంది ఈ చాట్‌బోట్స్ వల్ల మెడికల్ ఎడ్యూకేషన్ రూపురేఖలు మారిపోతాయని భావిస్తుంటే.. మరికొందరు మాత్రం దానికి ఇంకా సమయంపడుతుందంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News