Big Stories

Mayank Markande :మార్కండే బౌలింగ్‌లో అంత ఈజీకాదు.. ఎస్ఆర్‌హెచ్ స్పిన్నర్‌పై వాన్ పొగడ్తలు

Mayank Markande : ఇంగ్లండ్ మాజీ దిగ్గజ ఆటగాడ మైఖేల్ వాన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ సీజన్‌లో టఫ్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది మయాంక్ మార్కండేనే అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పుకొచ్చాడు. అతని బౌలింగ్‌లో ఆడడం బ్యాట్స్ మెన్‌కు అంత ఈజీ కాదంటూ కామెంట్ చేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించిందంటే కారణం… మయాంక్ మార్కండేనే అంటూ పొగిడాడు. 6.4తో ఎకానమీ రేటు కూడా ఫెంటాస్టిక్‌గా ఉందంటూ ప్రశంసించాడు.

- Advertisement -

నాలుగు ఓవర్లు వేసిన మార్కండే కేవలం 20 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. 9 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచిందంటే మెయిన్ రీజన్ మార్కండేనే. 198 పరుగులు చేసినప్పటికీ.. ఢిల్లీ ఆటగాళ్లు చాలా దగ్గరి వరకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో బాల్ తీసుకున్నాడు మార్కండే. మంచి ఊపు మీదున్న ఫిలిప్ సాల్ట్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. 35 బంతుల్లో 59 పరుగులు చేసిన ఫిలిప్ మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పేశాడు. సో, ఫిలిప్‌ను ఔట్ చేసి అదే ఊపులో ప్రియమ్ గార్గ్‌ను కూడా పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను తిరిగి హైదరాబాద్ వైపు తిప్పాడు మార్కండే.

- Advertisement -

మార్కండే బౌలింగ్‌ను అంచనా వేయడం చాలా కష్టం అనేది మైఖేల్ వాన్ అనాలసిస్. ఎదుటి బ్యాట్స్ మెన్ ఊహించలేని రీతిలో బాల్స్ వేయగలడని చెప్పుకొచ్చాడు. మార్కండే వేసే బాల్ ఎటు టర్న్ అవుతుందో అంచనా వేయలేకపోతే.. బ్యాట్‌కు టచ్ చేయడం కూడా కష్టమేనంటూ ప్రశంసించాడు.

అటు అభిషేక్ శర్మ పర్ఫామెన్స్‌ను కూడా ఆకాశానికెత్తాడు మైఖేల్ వాన్. ఈ ఎడిషన్‌లో చేసిన ఫస్ట్ హాఫ్ సెంచరీ ఇదే అయినప్పటికీ.. చాలా కీలక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడన్నాడు. అభిషేక్ శర్మకు తోడుగా ఎవరూ నిలవకపోయినా… 36 బాల్స్ లో 67 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆ భయం అలాగే మిగిల్చాడని, ఆ ధైర్యంతోనే క్లూసెన్ ధాటిగా ఆడగలిగాడని వివరించాడు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News