EPAPER

Mars Little Moon:- బయటికొచ్చిన మార్స్ లిటిల్ మూన్ ఫోటోలు.. యూఏఈ ఘనత..

Mars Little Moon:- బయటికొచ్చిన మార్స్ లిటిల్ మూన్ ఫోటోలు.. యూఏఈ ఘనత..

Mars Little Moon:– ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్ని స్పేస్ సెక్టార్‌లో విపరీతంగా పోటీపడుతున్నాయి. ఒక దేశం ఒక శాటిలైట్‌ను తయారు చేసి ఆకాశంలోకి పంపిస్తే.. అంతకంటే పెద్ద శాటిలైట్ తయారీకి మరో దేశం సన్నాహాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకొని ప్రజలకు చెప్పాలని మరో దేశం ఆరాటపడుతోంది. అలాగే యూఏఈ కూడా ఇదివరకు ఎవరూ సాధించని ఒక విషయాన్ని సాధించి చూపించింది.


ఇప్పటివరకు మార్స్‌పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే మార్స్‌లో ఉండే లిటిల్ మూన్‌ను మాత్రం ఇప్పటివరకు ఎవరూ అందుకోలేకపోయారు. తాజాగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు చెందిన అమల్ స్పేస్‌క్రాఫ్ట్ అనేది మార్స్‌ చుట్టూ 62 మైళ్లు ప్రయాణిస్తూ ఫోటోలు తీసింది. ఇందులో మార్స్ లిటిల్ మూన్ ఫోటోలు కూడా స్పష్టంగా క్యాప్చర్ అయ్యాయి. ఇటీవల దానికి సంబంధించిన ఫోటోలను యూఏఈ విడుదల చేసింది.

మార్స్‌లో లిటిల్ మూన్ ఉందని తెలిసినా దానిపై ఇప్పటివరకు ఎక్కువగా ప్రయోగాలు జరగలేదు. తాజాగా యూఏఈ ఈ లిటిన్ మూన్ మార్స్‌కు 9 మైళ్ల దూరంలో ఉందని తేల్చింది. ఇప్పటివరకు మార్స్‌లో ఉండే మరో మూన్ అయిన ఫోబోస్‌పై పలు పరిశోధనలు సక్సెస్‌ఫుల్‌గా జరిగాయి. ఎందుకంటే ఇది మార్స్‌కు కనీసం 3,700 మైళ్ల దూరంలో ఉంటుంది. అందుకే దీనిపై పరిశోధనలు చేయడం సులువుగా మారింది. అయినా కూడా ఇతర గ్రహాల మూన్స్‌తో పోలిస్తే మార్స్‌లో ఉండే మూన్స్ దానికి చాలా దగ్గరగా ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు.


ఇప్పటివరకు మార్స్‌కు సంబంధించిన మూన్స్‌లలో ఎక్కువ అటెన్షన్ ఫోబోస్‌కే వచ్చింది. ఇప్పుడు డిమోస్ వంతు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం అమాల్ స్పేస్‌క్రాఫ్ట్ వల్ల డిమోస్ ఫోటోలు బయటపడడంతో దీనిపై పరిశోధనలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. 1977లో నాసాకు చెందిన వైకింగ్ 2 అనేది డిమోస్‌కు దాదాపు 19 మైళ్లు దగ్గరగా వచ్చిందని గుర్తుచేసుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు డిమోస్ ఫోటోలు పలు స్పేస్‌క్రాఫ్ట్స్ ద్వారా బయటికి వచ్చినా అవి అమాల్ స్పేస్‌క్రాఫ్ట్ అంత స్పష్టంగా లేవని అన్నారు. 2020 జులై 19న మార్స్‌పైకి వెళ్లిన అమాల్ స్పేస్‌క్రాఫ్ట్ గురించి ప్రస్తుతం అంతరిక్ష ప్రపంచంలో వైరల్‌గా మారింది.

Tags

Related News

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

×