EPAPER

Mahindra SUV:- తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ లాంచ్ చేసిన మహీంద్రా

Mahindra SUV:- తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ లాంచ్ చేసిన మహీంద్రా

Mahindra SUV:- మహీంద్రా కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గ్లోబల్ ఎన్‌క్యాప్‌ భద్రతా పరీక్షల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన ఎక్స్‌యూవీ 300 డిజైన్ ఆధారంగా… ఎక్స్‌యూవీ 400 పేరుతో రెండు వేరియంట్లలో ఈ కారును తీసుకొచ్చింది… మహీంద్రా. ఇందులో 3.3 కిలోవాట్ ఛార్జర్‌తో వచ్చే ఎక్స్‌యూవీ 400 ఈసీ వేరియంట్‌ ధర రూ. 15.99 లక్షలు కాగా… 7.2 కిలోవాట్ ఛార్జర్‌తో వచ్చే ఈసీ వేరియంట్ ధర రూ.16.49 లక్షలు. ఇక 7.2 కిలోవాట్ చార్జర్ తో వచ్చే ఎక్స్‌యూవీ 400 ఈఎల్‌ వేరియంట్‌ ధరను రూ. 18.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ముందుగా బుక్ చేసుకున్న తొలి ఐదు వేల మంది వినియోగదారులకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని మహీంద్రా తెలిపింది. జనవరి 26 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. తొలి ఏడాదిలో 20 వేల ఎక్స్‌యూవీ 400లను అమ్మాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈసీ వేరియంట్‌లో 34.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ అమర్చారు. దీన్ని ఫుల్ ఛార్జ్‌ చేస్తే 375 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఎక్స్‌యూవీ 400 ఈఎల్‌లో 39.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఇది ఫుల్ ఛార్జ్‌తో 456 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ రెండు వేరియంట్లలోనూ ఒకే ఎలక్ట్రిక్‌ మోటార్‌ అమర్చారు. ఇది 110 కిలోవాట్‌ శక్తిని, 310 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం 150 కిలోమీటర్లు. కేవలం 8.3 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఎక్స్‌యూవీ 400 ప్రత్యేకత. ప్రయాణికుల భద్రత కోసం ఇందులో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు అమర్చారు. ఇక ఏడు అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్‌, స్మార్ట్‌ వాచ్‌ కనెక్టివిటీ, సన్‌ రూఫ్‌, రియర్ పార్కింగ్ కెమెరా, కీ లెస్‌ ఎంట్రీ, పుష్‌ బటన్‌ స్టార్ట్‌ వంటి ఫీచర్లు కూడా ఎక్స్‌యూవీ 400లో ఉన్నాయి.

Follow this link for more updates:- Bigtv


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×