EPAPER

Levis:- ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌తో ఏఐ ఒప్పందం..

Levis:- ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌తో ఏఐ ఒప్పందం..

Levis:- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ).. ప్రస్తుతం ఈ పేరు వినిపించని రంగం ఏదీ లేదేమో. టెక్నాలజీ రంగంలో మొదలయిన ఈ సంచలనం ప్రస్తుతం అన్ని రంగాల్లో తన సత్తా చాటుతోంది. మెడికల్ నుండి ఎడ్యూకేషన్ వరకు ఏఐ లేని రంగం అంటూ ఏదీ లేదు. అందుకే ఏఐను తమ బిజినెస్ కోసం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయట కొన్ని ప్రముఖ సంస్థలు. అందులో ఒక ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్‌తో ఏఐకు ఒప్పందం కూడా జరగడం విశేషం.


లెవీ అనే బ్రాండ్ గురించి దాదాపు ఫ్యాషన్ లవర్స్ అందరికీ తెలుసు. అయితే ఈ బ్రాండ్‌కు సంబంధించిన సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో తో ఒప్పందం చేసుకుంది ప్రముఖ ఏఐ సంస్థ లాలాలాండ్.ఏఐ. ఈ ఒప్పందం ఇటీవల జరిగింది. లెవీకి సంబంధించిన దుస్తులను ఏఐ జెనరేటెడ్ మోడల్స్‌తో చూపించడమే ఈ పార్ట్‌నర్‌షిప్ ముఖ్య లక్ష్యం. ఈ ఐడియాతో లెవీ బ్రాండ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకురావాలని లెవీ స్ట్రాస్ అండ్ కో భావిస్తోంది.

కేవలం ఏఐతో తయారు చేసిన వెబ్‌సైట్ లాలాలాండ్.ఏఐ. ఇది ఏఐ జెనరేటెడ్ మోడల్స్‌ను తయారు చేసే ఫ్యాషన్ స్టూడియోగా ఇప్పటికే ఎంతోమంది టెక్ లవర్స్‌తో పాటు ఫ్యాషన్ లవర్స్‌కు కూడా పరిచయమయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లోనే అడ్వాన్స్ మోడల్‌ను ఉపయోగించి ఫ్యాషన్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ ఈ వెబ్‌సైట్ ముందుకెళ్తోంది. ఇది ప్రతీ ఒక్కరి బాడీ, సైజ్, స్కిన్ టోన్‌ను బట్టి వారికి బ్రాండ్స్‌ను చూపిస్తూ ఉంటుంది.


లాలాలాండ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయినవారు వారి అవతార్‌ను క్రియేట్ చేసుకొని, దానికి సూట్ అయ్యే దుస్తులను సెలక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికే పలు సోషల్ మీడియా యాప్స్‌లో ఈ అవతార్ ఫీచర్.. యూజర్లకు అందుబాటులో ఉంది. ఇప్పుడు అదే ఫీచర్‌తో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది ఏఐ. అంతే కాకుండా ఈ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేస్తున్నవారు ఒక కొత్త అనుభూతికి లోనవుతున్నామని మంచి రివ్యూలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం రిటైలర్స్‌కు, కస్టమర్లకు మధ్య ఈ ఏఐ వెబ్‌సైట్ ఒక వారధిగా పనిచేస్తోంది.

ఎయిర్ ఫోర్స్ బేస్‌పై అమెరికా భారీ పెట్టుబడి..

for more updates follow this link:-bigtv

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×