Kopeshwar Temple :- మన దేశంలో పురాతన ఆలయాలకి లెక్కలేదు. ఎలాంటి టెక్నాలిజీ లేని ఆ రోజుల్లో ఊహకందని విధంగా ఆలయాలను నిర్మించారు. వెలకట్టలేని అపూర్వమైన సంపదనకు మనకి ఇచ్చారు. అలాంటి ఆలయాల్లో ఒకటి కోపేశ్వర మందిరం. ఈ ఆలయాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. పురాణ విశేషాలను , దేశీయ శిల్పకళను ఒకే చోట చూడాలంటే మహారాష్ట్ర వెళ్లాల్సిందే.
స్వర్గ మంటపం గుండ్రంగా నిర్మించారు. చుట్టూ ఉన్న కప్పుకి 12 స్తంభాలను ఆధారంగా ఉంచారు. రాజవంశీయుల ప్రతిమను వాటిపై చాలా అందంగా మలిచారు. మంటపం మధ్యలో నల్లని శిల సుందరంగా కనిపిస్తుంది. తలను పైకి ఎత్తి గోపుర గవాక్షం చూస్తే అద్భుతంగా గగన వీధని సందర్శించవచ్చు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో తొలిరోజు ఈ గవాక్షంలోంచి సూర్యకిరణాలు నేరుగా కోపేశ్వర స్వామిని స్పృశించడమే అసలు వండర్.
సభా మంటపం పై కప్పు మీద విరిసిన పద్మం 3డి పద్ధతిలో ఆ రోజుల్లో ఆవిష్కరణ చేయడం ఊహించలేం. గాలి , వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాటు చేసిన గవాక్షాలు దర్శనిమిస్తుంటాయి. మధ్యయుగంలో ఇంతటి ఆకృతులతో ఆలయ నిర్మాణం చేశారంటే వారు ఎంత విజ్ఞాన వంతులో చెప్పలేం. ఇరవై నుంచి 25 అడుగులు ఉన్న ఏక శిల స్తంభాలు లాంటివి ఎన్నో ఉన్నాయి. మస్వర్గమంటపం, సభామంటపం, అంతరాళ కక్ష్య, అడుగడుగునా కళ్లు చెదిరేలా శిల్పసంపద నిలయం ఈ ఆలయం. శ్రీ మహా విష్ణువు విగ్రహాన్ని ఆలయంలో దర్శనమిస్తుంది.
సతీదేవికి తోడుగా నందిని పంపించడం వల్ల ఈ శివాలయంలో నంది కనిపించదు. మనదేశంలో ఇలాంటి అంతులేని శిలా సంపద ఉన్న ఆలయాలు ఇంకా చాలా ఉన్నాయి. హారాష్ట్రలో మారుమూలన తెర మరుగున పడ్డ ఈ క్షేత్రానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. .