EPAPER

Uranus:- యూరేనస్ గురించి ఆసక్తికర సమాచారం బయటికి..

Uranus:- యూరేనస్ గురించి ఆసక్తికర సమాచారం బయటికి..

Uranus:- స్పేస్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందిన తర్వాత దాదాపు అన్ని గ్రహాల గురించి శాస్త్రవేత్తలకు ఒక అవగాహన వచ్చేసింది. ప్రతీ గ్రహం ఎలా పనిచేస్తుంది అనే దగ్గర నుండి దాని జియోగ్రఫీ, హిస్టరీ వరకు అన్ని విషయాలు వారికి బలంగా గుర్తిండిపోయాయి. తాజాగా గ్రహాల్లో ఒకటైన యూరేనస్ గురించి కొత్త విషయాలు తెలుసుకొని శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. వెబ్ టెలిస్కోప్ ద్వారా వారికి ఈ వివరాలు తెలుసుకోవడం సాధ్యమయ్యింది.


మామూలుగా గ్రహాలు అన్ని ఎలా ఉంటాయో మనం చిన్నప్పటి సైన్స్ టెక్ట్స్ బుక్స్‌లో చూసే ఉంటాం. అందులో ఒకటైన యూరేనస్.. డార్క్ బ్లూ కలర్‌లో ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక బ్లూ కలర్ బంతిలాగా కనిపిస్తుంది. తాజాగా దీని గురించి తెలియని ఒక కొత్త విషయం జేబ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా బయటపడింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఇప్పటివరకు అంతరిక్షంలో ఎవరూ కనిపెట్టని విషయాల గురించి కనిక్కోవడం కోసం తయారు చేశారు. అందుకే దీని ద్వారా ఇప్పటివరకు యూరేనస్ చుట్టూ ఎవరూ బయటపెట్టలేని ప్రకాశవంతమైన రింగ్స్ బయటపడ్డాయి.

సోలార్ సిస్టమ్‌లో ఉండే కొన్ని గ్రహాల చుట్టూ రింగ్స్ ఉండడం సహజమే. అలాగే యూరేనస్ చుట్టూ కూడా రింగ్స్ ఉంటాయి. నాసా శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం ఇప్పటివరకూ యూరేనస్ చుట్టూ ఉన్న రింగ్స్‌ను కేవలం రెండు కెమెరాలు మాత్రమే క్యాప్చర్ చేయగలిగాయి. ముందుగా 1986లో అంతరిక్షానికి ఎగిరిన వోయాగర్ 2 స్పేస్‌క్రాఫ్ట్ ఈ రింగ్స్‌ను ఫోటో తీసింది. ఆ తర్వాత హవాయ్‌కు చెందిన ఒక ఆబ్జర్వేటరీ.. కొత్త ఆప్టిక్ టెక్నాలజీ సాయంతో ఈ రింగ్స్‌పై పరీక్షలు చేపట్టింది.


గత కొన్నేళ్లుగా యూరేనస్ రింగ్స్ అనేవి కనిపించడం లేదని, చాలాకాలం తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ రింగ్స్‌ను చూస్తున్నామని నాసా శాస్త్రవేత్త బయటపెట్టారు. ఐస్, డస్ట్‌తో ఫార్మ్ అవ్వడం వల్ల యూరేసస్ రింగ్స్ అంత సులువుగా కనిపించవని వారు తెలిపారు. యూరేనస్ గ్రహం కూడా ఐస్, నీళ్లు, మిథేన్, అమ్మోనియా వంటి వాటితో ఏర్పడిందన్నారు. సోలార్ సిస్టమ్‌లో ఉండే గ్రహాల్లో యూరేనస్ మాత్రమే కాస్త వంపు తిరిగి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి చుట్టూ ఒక్క రౌండ్ తిరగడానికి యూరేనస్‌కు 84 ఏళ్లు పడుతుంది. అంటే యూరేనస్ అనేది ఏ సీజన్‌లో అయినా ఎక్కువకాలం ఉండాల్సి వస్తుంది.

యూరేనస్‌కు పూర్తిగా 13 రింగ్స్ ఉంటాయి. అందులో కొత్తగా విడుదల చేసిన ఇమేజ్‌లో 11 రింగ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో కొన్ని రింగ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. అందులోని 9 రింగులు ముఖ్యమైనవని, మిగిలినవి డస్ట్ ద్వారా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తులో యూరేనస్‌పై చేయనున్న పరిశోధనల్లో మరికొన్ని రింగ్స్ బయటపడే అవకాశం ఉందని అన్నారు. అయితే యూరేనస్ చుట్టూ ఎన్ని రింగ్స్ బయటపడినా.. శాటర్న్ మాత్రం ఎప్పటికీ క్వీన్ ఆఫ్ రింగ్స్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×