BigTV English

ISRO:- సక్సెస్‌ఫుల్‌గా ఇస్రో ‘బాహుబలి’ రాకెట్ లాంచ్..

ISRO:- సక్సెస్‌ఫుల్‌గా ఇస్రో ‘బాహుబలి’ రాకెట్ లాంచ్..

ISRO:- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇప్పటికే ఎన్నో మైళ్లురాళ్లను దాటింది. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు తన పరిశోధనలతో గట్టి పోటీ ఇస్తున్న ఇస్రో.. ఇప్పుడు మరో సంచలనాన్ని సృష్టించింది. ఇప్పటివరకు చరిత్రలో లేనంత బరువైన రాకెట్‌ను స్పేస్‌లోకి పంపించడంలో సక్సెస్ సాధించింది. అదే ఎల్‌వీఎం3 (LMV-3) ఎం-3. 24 గంటలుగా దీని ప్రయాణ కౌంట్‌డౌన్‌ను మొదలుపెట్టిన ఇస్రో.. ఫైనల్‌గా దీనిని గాలిలోకి పంపింది.


లో ఎర్త్ ఆర్బిట్‌ (లియో)లో పరిశోధనల కోసం ఇస్రో ఎల్‌వీఎం3 రాకెట్‌ను తయారు చేసింది. అంతే కాకుండా దీంట్లో ఒకేసారి 36 శాటిలైట్లను స్పేస్‌కు పంపించి కొత్త చరిత్రను సృష్టించింది. ఎల్‌వీఎం3 డెస్టినేషన్‌కు ఈ 36 శాటిలైట్లను సక్సెస్‌ఫుల్‌గా చేర్చింది. దీంతో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చ్ 26 ఉదయం 9.00 గంటలకు ఎల్‌వీఎం3 గాలిలోకి ఎగిరింది. ఆ తర్వాత డెస్టినేషన్‌కు రీచ్ అయ్యి అక్కడ శాటిలైట్లను ఒక్కొక్కటిగా విడుదల చేసింది. ఈ ప్రక్రియ దాదాపు గంటన్నరపాటు సాగింది.

ఎల్‌వీఎం3 రాకెట్‌కు బాహుబలి రాకెట్ అని మరో పేరు కూడా పెట్టారు. ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించడం కోసం బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్‌తో ఇస్రో ఒప్పందం కూడా చేసుకుంది. ఇప్పటికే వీరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం తొలి విడతగా 2022 అక్టోబర్ 23న 36 శాటిలైట్లు నింగిలోకి చేరాయి. ఇప్పుడు రెండో విడతగా మరో 36 శాటిలైట్లు నింగిలోకి సక్సెస్‌ఫుల్‌గా ఎగిరాయి. అయితే ఈ ఒక్కొక్క శాటిలైట్ బరువు 150 కిలోలు ఉంటుందని తెలుస్తోంది.


లాంచ్ వెహికల్ మార్క్-3 (ఎల్‌వీఎం3) అనేది జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ (GSLV MK-3)కి అప్డేటెడ్ వర్షన్‌గా తయారుచేయబడింది. అయితే ఈ ఎల్‌వీఎం3 అనే రాకెట్ దాదాపు 4 టన్నుల బరువున్న శాటిలైట్లను స్పేస్‌కు మోసుకెళ్లగలదు. ఇప్పుడు ఈ 36 శాటిలైట్లను సక్సెస్‌ఫుల్‌గా లియోకు తీసుకెళ్లడంతో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌తో పాటు ఈ రాకెట్ లాంచ్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్క సైంటిస్ట్.. సంతోషంలో మునిగిపోయారు.

బ్లూ టిక్‌పై ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం..

for more updates follow this link:-bigtv

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×