Big Stories

iPhones : హ్యాకింగ్‌కు గురవుతున్న ఐఫోన్లు.. ఒక్క మేసేజ్‌తో..

- Advertisement -

iPhones : స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ ఫోన్లకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రత్యేకంగా ఇందులో ఉండే ఐఓఎస్ సిస్టమ్ అనేది యూజర్ల ప్రైవసీని ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీల కంటే ఎక్కువగా కాపాడుతుందని కస్టమర్లు నమ్ముతుంటారు. ఆ నమ్మకమే ఎన్నో ఏళ్లుగా యాపిల్ ఫొన్లను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. కానీ ఇప్పుడు హ్యకర్ల దాటికి ఐఫోన్ కూడా లొంగిపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జరిగిన సంఘనలనే వారు ఇలా చెప్పడానికి కారణమయ్యాయి.

- Advertisement -

మామూలుగా ఐఫోన్‌ను హ్యాక్ చేయడం కష్టం. కానీ ఐమెసేజ్ ద్వారా హ్యాకర్లు ఐఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారని నిపుణులు కనుగొన్నారు. ఐమెసేజ్ ద్వారా ఐఓఎస్ డివైజ్‌ను పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకోవాలని వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ కనిపెట్టారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పెర్‌స్కై ఐఓఎస్ డివైజ్‌లకు పొంచి ఉన్న ప్రమాదాన్ని బయటపెట్టారు. ఒక మాల్వేర్ ద్వారా హ్యాకర్లు కలిసికట్టుగా ఐఓఎస్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారని తెలుసుకున్నారు.

ఆపరేషన్ ట్రాయాంగులేషన్ పేరుతో ఐఓఎస్ కస్టమర్లను హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వారు పంపిన ఐమెసేజ్‌పై ఒక క్లిక్ చేస్తే చాలు.. ఫోన్‌లోని సమాచారం అంతా వారి చేతిలోకి వెళ్లిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలో పనిచేసే ఉద్యోగులే హ్యాకర్ల ప్రథమ టార్గెట్ అని తెలుస్తోంది. యూజర్ల సమాచారాన్ని తెలుసుకోవడం కోసం హ్యాకర్లు పంపే ఐమెసేజ్ అనేది తమ పని ముగిసిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుందని నిపుణులు కనుగొన్నారు.

ఐఓఎస్ యూజర్లు ఇప్పటివరకు తమ సమాచారం అనేది ఎక్కడికి పోదని నమ్మకంతో ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కాబట్టి వారు కొంచెం జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలని నిపుణులు నిర్ణయించుకున్నారు. ఒకవైపు హ్యాకర్లు తమ పని తాము చేసుకుంటున్న సమయంలోనే ట్రాయాంగులేషన్ గురించి వీలైనంత వరకు అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని వారు అనుకుంటున్నారు. అంతే కాకుండా ఈ హ్యాకర్ల నుండి కాపాడుకోవడం కోసం థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌ను కనిపెట్టడం మంచిదనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News