EPAPER

India’s position:- సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇండియా స్థానం ఏంటంటే..

India’s position:- సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇండియా స్థానం ఏంటంటే..

India’s position:-సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి ముందుకు వెళ్లడానికి ఇండియా కృషిచేస్తోంది. ఇప్పటికే ఇతర దేశాల సాయం లేకుండా ఇండియా ఎన్నో కొత్త అధ్యాయనాలకు శ్రీకారం చుట్టింది. ఇండియా చేసిన ఎన్నో పరిశోధనలు.. ఇతర దేశాలకు సోర్స్‌గా మారాయి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఇతర దేశాలతో పోటీపడి ఇండియా ఏ స్థానానికి చేరుకుందో బయటపడింది.


ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న 44 టెక్నాలజీల విషయంలో చైనా టాప్ స్థానంలో ఉంది. ఇక ఈ విభాగంలో టాప్ 5 స్థానంలో ఇండియా చోటుదక్కించుకుందని శాస్త్రవేత్తలు గర్వంగా తెలిపారు. ఇప్పటికే ఇతర దేశాలతో పోటీపడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ సూపర్‌పవర్‌గా మారాలనుకుంటున్న చైనా తొలి విజయం సాధించింది. అయితే ఇంకా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ ఇండియా కూడా ఈ లిస్ట్‌లో చోటుదక్కించుకోవడం పరిశోధకులకు కొత్త ఉత్సాహాన్ని అందించనుంది.

డిఫెన్స్, స్పేస్, రోబోటిక్స్ విషయంలో ఇండియా ఇతర దేశాలకు గట్టి పోటిని అందిస్తుందని రిపోర్టులో తేలింది. హైపర్‌సోనిక్స్ లాంటి ఏరో ఇంజన్స్ విషయంలో ఇండియా మూడో స్థానాన్ని దక్కించుకుంది. డ్రోన్స్, రోబోటిక్స్ విభాగంలో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. చైనా తర్వాత అత్యధిక విభాగాల్లో టాప్‌లో నిలిచిన దేశంగా అమెరికా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత స్థానం ఇండియాకు దక్కడం గర్వంగా ఉందంటూ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఈ లిస్ట్‌ను బట్టి ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ దేశం శాసిస్తుందో సులువుగా అంచనా వేయవచ్చని నిపుణులు తెలిపారు. చైనా ఇప్పటికే తన పరిశోధనల్లో వేగం పెంచగా.. ఈ రిపోర్ట్ వారికి మరింత కొంత ఉత్సాహాన్ని అందిస్తుందని అందరూ భావిస్తున్నారు. దీని కారణంగా ఇతర దేశాలకు చైనా టార్గెట్‌గా మారనున్నట్టు తెలుస్తోంది. చైనాకంటే ముందుగా పరిశోధనలు చేయాలని దేశాలన్నీ టార్గెట్‌గా పెట్టుకోనున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పోటీలో ఇండియా కూడా భాగంకానుంది.

Tags

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Big Stories

×