EPAPER

Indian R&D:వెనకబడుతున్న ఇండియా ఆర్&డీ..

Indian R&D:వెనకబడుతున్న ఇండియా ఆర్&డీ..

Indian R&D:ఇప్పటికే ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు పోటీపడుతున్నాయి. భారీ ఎకానమీ ఉన్న దేశాలు వనరుల కోసం పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. ఒకవేళ వారికి కావాల్సిన వనరులు ఖర్చుతో కూడుకున్నవే అయినా భరించగలుగుతారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం వాటితో పోటీపడడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండియా పరిస్థితి కూడా అలాగే ఉంది.


రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్&డీ) విషయంలో ఇండియా.. ఇతర దేశాలతో పోటీపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ భారీ ఎకానమీ ఉన్న దేశాల స్థాయిని మాత్రం అందుకోలేకపోతోందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్&డీ ద్వారా ఇండియాకు అందుతున్న జీడీపీ శాతం 0.7 మాత్రమే. ప్రపంచంలో ఆర్&డీ విభాగంలో జీడీపీ యావరేజ్ 1.8 శాతంగా ఉంది. అంటే ఇండియా యావరేజ్ కంటే చాలా తక్కువలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం ఆర్&డీ విభాగంలో సరిపడా పెట్టుబడులు లేకపోవడమే అని తెలుస్తోంది.

కార్పొరేట్ సెక్టార్‌లో ఆర్&డీలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా సంస్థలు ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా.. కేవలం మూడోవంతు మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇండియాలో కార్పొరేట్ సెక్టార్ నుండి ఆర్&డీకి వస్తున్న పెట్టుబడులు కేవలం 37 శాతమే. అందుకే ఇతర దేశాల సాయంతో ఆర్&డీని డెవలప్ చేయాలని ఇండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుగా అమెరికా ముందుకొచ్చింది.


ముందుగా 2018లో ఇండియాలోని ఆర్&డీ ₹649.7 బిలియన్ పెట్టుబడులు పెట్టిన అమెరికా.. ఆ తర్వాత ₹690.2 బిలియన్‌కు ఆ పెట్టుబడులను పెంచింది. అమెరికాతో పాటు ఎన్నో ఇతర దేశాలు కూడా ఇందులో భాగమయ్యాయి. ఎంత ఇతర దేశాల నుండి సాయం తీసుకున్నా.. ఇండియా ఆర్&డీ అనుకున్న స్థాయిలో డెవలప్ అవ్వడం లేదని నిపుణులు వాపోతున్నారు. అయితే ఇందులో ప్రభుత్వం సాయం లేకపోవడం కూడా కారణమే అని వారు విమర్శిస్తున్నారు.

ప్రైవేట్ సంస్థలు ఆర్&డీపై ఎంత పెట్టుబడి పెడుతున్నాయో తెలుసుకోవడానికి ఎలాంటి ప్రత్యేకమైన మార్గం లేదని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా కార్పొరేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న సంస్థలు ఆర్&డీపై కచ్చితమైన పెట్టుబడులు పెట్టాలన్న రూల్ కూడా లేకపోవడంతో వారు ఈ విషయంపై ఆసక్తి చూపించడం లేదని అభిప్రాయపడుతున్నారు. ముందుగా ఆర్&డీ గురించి పూర్తి డేటా ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ.. తగిన చర్యలు తీసుకోవడం దీని అభివృద్ధికి సహాయపడుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Computer Chips Efficient:కంప్యూటర్ చిప్స్‌ను మెరుగుపరిచే డైమండ్లు..

Korean Scientists:బ్రిడ్జిల ధృడత్వాన్ని గమనిస్తూ ఉండే టెక్నాలజీ..

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×