EPAPER

IND vs ZIM 1st T20I Match Preview: జింబాబ్వేలో ఐపీఎల్ కుర్రాళ్లు.. నేడే తొలి టీ 20 మ్యాచ్

IND vs ZIM 1st T20I Match Preview: జింబాబ్వేలో ఐపీఎల్ కుర్రాళ్లు.. నేడే తొలి టీ 20 మ్యాచ్
India vs Zimbabwe 1st T20I Match Dream11 Predictions: టీమ్ ఇండియాలో ముగ్గురు అతిరథులు టీ 20కి రిటైర్మెంట్ ప్రకటించారు. మా సమయం వచ్చింది. ఇక మాకు సెలవు ఇప్పించండి అని తెలిపారు. అలాంటి సమయంలో జింబాబ్వే పర్యటనకు యువ జట్టు ఒకటి 5 టీ 20లు ఆడేందుకు వెళ్లింది. సిరీస్ లో భాగంగా నేడు తొలి టీ 20 మ్యాచ్ హరారేలో సాయంత్రం 4.30కి ప్రారంభం కానుంది.

దాదాపు టీ 20 ప్రపంచకప్ సాధించిన టీమ్ ఇండియాలో సంజూశాంసన్, యశస్వి జైశ్వాల్, రింకూసింగ్, శివమ్ దూబె నలుగురు తప్ప అందరికి రెస్ట్ ఇచ్చారు. వారిని జింబాబ్వే జట్టులోకి తీసుకున్నారు. మరో రెండురోజుల్లో వారు జింబాబ్వే బయలుదేరుతారు. మూడో టీ 20 మ్యాచ్ నుంచి వారు అందుబాటులోకి వస్తారు.


ప్రస్తుతం నేడు జరగనున్న మ్యాచ్ లో ఇటీవల ఐపీఎల్ లో తుక్కుతుక్కు కింద కొట్టిన బలమైన హార్డ్ హిట్టర్స్  పలువురికి అవకాశం కల్పించారు. మరోవైపు ఓపెనర్ శుభ్ మన్ గిల్ నాయకత్వం వహించనున్నారు. అతనితో పాటు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, జితేష్ శర్మ లాంటి కుర్రాళ్లు ఉన్నారు.

మరోవైపు జింబాబ్వేకు  సికందర్ రజా నాయకత్వం వహిస్తున్నాడు. 20 ఓవర్లే కావడం, వరుసగా జట్టులో 10 మంది ఆటగాళ్లు ఉండటం, మనిషి రెండు ఓవర్లు నిలబడి ఆడినా చాలు అనే భావన ఇప్పుడందరిలో ఉంది. అందుకని జింబాబ్వే జట్టులో కూడా ధనాధన్ ఆడేవాళ్లకు కొదవలేదు. ఏదేమైనా అంత వన్ సైడ్ గా మ్యాచ్ ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Also Read: సిరాజ్ కు బ్రహ్మరథం.. హైదరాబాద్ లో విజయోత్సవ ర్యాలీ

జింబాబ్వే పర్యటనను కేవలం యువ ఆటగాళ్లను పరీక్షించడానికే అనే సంగతి అందరికీ తెలిసిందే. మరెంతమంది నిరూపించుకుంటారో, మరెంతమంది మరో అవకాశం కోసం చూస్తారో వేచి చూడాల్సిందే.
ఇప్పుడు రోహిత్ శర్మ టీ 20కి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను టీమ్ మేనేజ్మెంట్ పరిశీలిస్తోందనేది అర్థమవుతోంది.

మరో వైపు హార్దిక్ పాండ్యాకు లైన్ లో ఉన్నాడు. ఎందుకంటే టీ 20 ప్రపంచకప్ లో అటు బాల్, ఇటు బ్యాట్ తో కూడా ఆకట్టుకున్నాడు. ఇక అన్నింటికి మించి సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఆప్షన్ గా ఉన్నాడు. మరి ఈ సిరీస్ తో గిల్ సంగతి తేలిపోతుందని, అందరి డౌట్లు క్లియర్ అవుతాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×