Big Stories

India vs coronavirus : భవిష్యత్ మహమ్మారులకు భారత్ సిద్ధం..!

India vs coronavirus : కోవిడ్ 19 అనేది ఇండియాలోకి వచ్చే సమయానికి దేశ వైద్య రంగం ఇలాంటి ఒక మహమ్మారిని తట్టుకోవడానికి సిద్ధంగా లేదు. అలాంటి ఒక వైరస్ వస్తుందని, అందరి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఎవరూ ఊహించక ముందే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇప్పటినుండి అయినా ఇలాంటి మహమ్మారులను ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలని భారత్ నిర్ణయించుకుంది.

- Advertisement -

సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ ప్లాట్‌ఫామ్స్ (సీ క్యాంప్) తాజాగా భవిష్యత్తులో వచ్చే భయంకరమైన వ్యాధుల నుండి అనూహ్య మహమ్మరుల నుండి భారత్‌ను కాపాడడానికి ఓ కొత్త ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. బెంగుళూరు లైఫ్ సైన్సెస్ క్లాస్టర్ (బ్లిస్క్) సపోర్ట్‌తో ఈ కార్యక్రమం లాంచ్ అయ్యింది. రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ఫైండ్ లాంటి సంస్థలు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయాన్ని అందించనున్నాయి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కేవలం కోవిడ్ 19కు మాత్రమే కాకుండా భవిష్యత్తులో వచ్చే మహమ్మారులకు కూడా డయాగ్నస్టిక్స్ అనేవి సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరగనున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా ఈ డయాగ్నస్టిక్స్ ఏర్పాటు చేయడానికి సీ క్యాంప్ అండగా నిలబడనుంది. అమెరికా లాంటి దేశాల్లో ఉన్న విజన్.. భారత్‌తో పాటు ఎన్నో ఇతర దేశాల్లో కూడా ఏర్పాటు చేయాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

ముందుగా డయాగ్నస్టిక్స్ ఏర్పాటు చేయడం వల్ల అంటువ్యాధులను తొందరగా గుర్తించి వాటిని నివారించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీ క్యాంప్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కేవలం హై క్వాలిటీ డయాగ్నస్టిక్స్ విషయంలోనే కాదు.. వైద్య రంగంలో ఇన్నోవేషన్, డెవలప్మెంట్ వాటిపై కూడా ఫోకస్ పెట్టనుంది. అంతే కాకుండా ప్రజలకు వెంటవెంటనే వైద్యం అందించడానికి కూడా సన్నాహాలు చేయాలని నిర్ణయించుకుంది.

2020లో ముందుగా సీ క్యాంప్ ఇలాంటి ఓ కార్యక్రమాన్ని నిర్వహించి 10 లక్షలకు పైగా ఆర్టీ పీసీఆర్ కిట్లను వైద్యులకు అందించింది. అంతే కాకుండా ర్యాపిక్ కిట్ల తయారీలో ముఖ్య పాత్ర పోషించింది. అందుకే ఇప్పుడు డయాగ్నస్టిక్స్ విషయంలో కూడా ఈ కార్యక్రమం సక్సెస్ సాధించాలని వైద్యులు కోరుకుంటున్నారు. ఎన్నో ప్రభుత్వ సంస్థలతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నీతి అయెగ్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టార్టప్ ఇండియా లాంటి సంస్థలు ఈ కార్యక్రమానికి అండగా నిలబడనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News