EPAPER

Ban On Diesel Cars : ఇండియాలో డీజిల్ కార్లు బ్యాన్.. అప్పటినుండే..

Ban On Diesel Cars : ఇండియాలో డీజిల్ కార్లు బ్యాన్.. అప్పటినుండే..
Ban On Diesel Cars


Ban On Diesel Cars : ప్రస్తుతం కస్టమర్ల అంతా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎందుకు షిఫ్ట్ అవుతున్నారో క్లారిటీ లేకపోయినా.. దీని వల్ల పర్యావరణానికి మాత్రం మంచి జరుగుతుందని పర్యావరణవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్ల్యూయల్ కార్ల వల్ల కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల అలాంటి సమస్యలు ఏమీ ఉండవు. ఇది గ్రహించిన భారత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. త్వరలోనే ఇండియన్ రోడ్లపై డీజిల్ వాహనాలు తిరగకూడదని నియమాన్ని పెట్టింది.

2027లోపు ఇండియాలో డీజిల్ వాహనాలు తిరగకూడదు అని మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్.. ఒక ప్లీను సమర్పించింది. ప్రస్తుతం ఇండియాలో దాదాపు 1 మిలియన్ డీజిల్ కార్ యూజర్లు ఉండగా.. వారందరూ 2027లోపు ఎలక్ట్రిక్ వాహనాలకు కానీ, ఇతర ఫ్ల్యూయల్ వాహనాలకు కానీ మారిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యాన్ ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ మరింత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆటోమొబైల్ రంగంలో డీజిల్ కంటే ఎక్కువగా నేచురల్ గ్యాస్‌ను ఉపయోగిస్తే కూడా కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటోంది.


కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం కోసం డీజిల్ కార్లను బ్యాన్ చేయడం అవసరమా అంటూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కానీ డీజిల్ నుండి విడుదలయ్యే గ్యాసుల వల్ల మనుషులకు గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు, అస్థమా.. లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇక శాస్త్రవేత్తలు రెన్యువబుల్ గ్యాసుల ద్వారా కరెంటును తయారు చేయాలనుకుంటున్న ఈ క్రమంలో డీజిల్ కార్లు వారికి ఏ విధంగానూ సహాయపడవని చెప్తున్నారు.

ఒక్కసారిగా నాలుగేళ్ల లోపు డీజిల్ కార్లను బ్యాన్ చేయాలనే ఆదేశం రావడంతో కార్ల తయారీ సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే డీజిల్ కార్లకు నెగిటివిటీ పెరుగుతుండడంతో మునుపటితో పోలిస్తే.. సంస్థలు.. ఈ కార్లను తయారు చేయడం చాలావరకు తగ్గించేశాయి. 2020 ఏప్రిల్ 1 నుండే మారుతీ సుజుకీ డీజిల్ కార్ల తయారీని నిలిపివేసింది. అలాగే హ్యూండాయ్ కూడా ఈ విషయంలో చర్యలు తీసుకుంటోంది. మిగతా కంపెనీలు కూడా చర్యలకు సిద్ధమవుతున్నాయి. కేవలం ఇండియా మాత్రబమే కాదు ఇప్పటికే అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో డీజిల్ కార్లు బ్యాన్ అయ్యాయి.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×