EPAPER

Importance of Aishwarya Deepam : ఐశ్వర్య దీపం ఫలితాన్ని ఇవ్వాలంటే..

Importance of Aishwarya Deepam : ఐశ్వర్య దీపం ఫలితాన్ని ఇవ్వాలంటే..


Importance of Aishwarya Deepam :- శ్రీ మహాలక్ష్మి కటాక్షం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సంపద కోసం, అప్పులు తీరడం కోసం నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అప్లైశ్వర్యాలు చేకూరుతాయి. వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద చేతిలో నిలుస్తుంది. వ్యాపారంలో లాభాలు వుంటాయి.

అరకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం సహకరిస్తుంది. ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ వుండదు. ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది.


ముందుగా ఓ ఇత్తడి ప్లేటును రెండు వెడల్పాటి ప్రమిదలు తీసుకోవాలి. రాళ్ల ఉప్పును తప్పక శుక్రవారం ఉదయం తీసుకోవడం చేయాలి. కలకండ, అక్షింతలు పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. ఓ చిన్నపాటి బెల్లం ముక్క.. అరటిపండ్లు రెండు, తాంబూలం కూడా తీసుకోవాలి. పూజకు ముందు.. ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని.. పూజగదిలో లక్ష్మీ ఫోటోను, లేదా ప్రతిమను శుభ్రం చేసుకుని చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. పువ్వులతో పటాలను అలంకరించుకోవాలి. బియ్యం పిండితో రంగవల్లికలు వేసిన తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి.

ముందుగా ఇత్తడి ప్లేటును తీసుకుని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమీదలను వుంచాలి. దానిపై నేతితో కానీ, నువ్వుల నూనెతో దీపమెలిగించాలి. ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యంగానీ లేదా ఓ చిన్న పాటి బెల్లం ముక్కను పెట్టుకోవచ్చు. ఇక తాంబూలం తప్పక ఉండాలి. తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. అంతే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే. ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయం సాయంత్రం వెలిగించి.. శనివారం లేదా ఆదివారం దీపాన్ని ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపేయాలి. అలాకాకుంటే ఇంట్లోని సింక్ లో ఉప్పును పారవేయాలి. ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అప్లైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ దీపం వెలిగించేటప్పుడు కనకధార స్తోత్రాన్ని పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×