EPAPER

House Flies : యాక్ తూ.. ఈగలు ఆహారంపై వాలినప్పుడు ఇలా చేస్తాయా..!

House Flies : యాక్ తూ.. ఈగలు ఆహారంపై వాలినప్పుడు ఇలా చేస్తాయా..!

House Flies : సాధారణంగా ఈగలపై మనం పెద్దగా శ్రద్ధ చూపం. అవి మన చుట్టూ జుయ్ అని తిరుగుతూనే ఉంటాయి. అవి మనం తినే ఆహారంపై వాలినప్పుడు మాత్రమే ఎక్కడలేని చికాకు వస్తుంది. లేదంటే వాటిని అసలు పట్టింకోము. ఈగలు మన మీద వాలినప్పుడు మాత్రమే వాటిని తరుముతాం. మీకు తెలుసా ఈగలు భయంకరమైన వైరస్‌లను మోస్తాయి. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. కలరా, టైఫాయిడ్, విరేచనాలు, క్షయవాధి వంటి తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన క్రిములకు ఈగలు బాధ్యత వహిస్తాయి.


అయితే మన కళ్ల మందున్న చూస్తూ ఉండిపోతాం. మనకున్న ఈ చెడు అలవాటే వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా బజారుల్లో తినే ఆహారంపై కూర్చునే ఈగలు చాలా వ్యాధులకు నాంది పలుకుతాయి. కాబట్టి ఈగలు మనం తినే ఆహారంపై వాలినప్పుడు ఏం జరుగుందో ఒకసారి చూడండి.

ఇంటి ఆవరణలో తిరిగే ఈగలు క్రమం తప్పకుండా బహిర్భూమిలో పడి ఉన్న మలం, చెత్తాచెదారంపై వాలడం, మళ్లీ అవే ఇంట్లోకి వచ్చి.. ఆహార పదార్థాలపై ఉండటం తలచుకుంటేనే అసహ్యంగా ఉంటుంది. దీని వల్ల వ్యాధులు కూడా వస్తాయి. ఈగలు మలం, కుళ్లిన పదార్థాలను తింటాయి.


BMC పబ్లిక్ హెల్త్ జర్నల్ ప్రకారం.. క్రిములు ఈగల రెక్కలకు, మోత్ పార్టులు, ఇతర శరీర భాగాలకు అంటుకుని ఉంటాయి. మీరు తినే ఆహారంలో ఈగలు దిగినప్పుడు.. ఆ క్రిములను విడుదల చేస్తాయి. ఈ ఆహారం తీసుకుంటే అనారోగ్యానికి గురికావడం ఖాయం.

ఈగలు ఆహారం కూర్చుని తింటాయి. మీలో చాలా మంది అనుకుంటారు. ఈగలకు దంతాలు ఉండవు కదా.. ఆహారాన్ని ఎలా తింటాయి..? ఈగ ఆహారాన్ని తినడానికి మీ ఆహారంలో ఎంజైమ్ రిచ్ లాలాజలాన్ని ఉమ్మి వేస్తుంది లేదా వాంతి చేసుకుంటుంది.

ఆ లాలాజలం ఆహారాన్ని కరిగించే జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఈగ ఆహారంలో పాక్షికంగా కరిగిన జీర్ణ ద్రవాల మిశ్రమాన్ని గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ నిమిషాల సమయం పడుతుంది. ఈగలు మీ ఆహారంలో మలాన్ని కూడా విసర్జిస్తాయి. ఈగలు కూర్చున్నప్పుడు మాత్రమే మలవిసర్జన చేసి గుడ్లు పెడతాయి.

ఈగల నుంచి ఆరోగ్యాన్ని ఇలా రక్షించుకోండి..

  • బజారుల్లో ఆహారాన్ని తినడం మానేయండి
  • సగం నిమ్మకాయ లోపల 6 లవంగాలు ఉంచండి. 3-4 నిమ్మకాయలను ఇలానే చేసి వంటగదిలో ఉంచండి. ఈ పదార్థాల సువాసన ఈగలను దూరంగా ఉంటాయి.
  • మీ ఇంటిని, వంట గదిని క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచండి
  • ఆహారం ఉన్న ప్రాంతంలో పసుపు రంగు బల్బులు లేదా డిమ్ లైట్లను ఉపయోగించండి
  • ఆల్కహాల్ ఆధారిత మౌత్ ఫ్రెష్‌లను వాడండి. దీన్నే ఆహారం చుట్టూ ఉన్న టేబుల్, కుర్చీలపై స్ప్రే చేయండి.
  • వెనిగర్, యూకలిస్ట్ మిశ్రమాన్ని ఈగలు ఉన్న చోట స్ప్రే చేయండి
  • ఉప్పు కలిపిన నీటిని బాగా మరిగించి స్ప్రే చేయండి
  • మురుగు కాలువలు మూసివేయండి
  • కర్పూర వెలిగించి ఇంట్లో మొత్తం పొగవేయండి
  • ఇంటి లోపల తులసి మొక్కలను పెంచండి
  • వీనస్ ఫ్లైట్రాప్ మొక్కను ఇంటి ఆవరణలో నాటితే వర్షాకాలంలో దోమల బెడద పోతుంది
  • బిర్యానీ ఆకులతో ఇంట్లో పొగవేయండి
  • ఉప్పును లిక్విడ్‌గా చేసి ఈగలు ఉన్న చోట చల్లండి

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×