EPAPER

Hold In a Sneeze : తుమ్మును బలవంతంగా ఆపుతున్నారా.. చాలా డేంజర్ సుమీ..!

Hold In a Sneeze : చాలామంది తుమ్ములను బలవంతంగా ఆపుకుంటారు. ఏందుకంటే తుమ్ములపై మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలానే నమ్మకాలు ఉంటాయి. పిల్లలు తుమ్మితే మన పెద్దలు “చిరంజీవ.. చిరంజీవ” అని అంటారు. ఎందుకంటే తుమ్మును పునర్జన్మగా భావిస్తారు

Hold In a Sneeze : తుమ్మును బలవంతంగా ఆపుతున్నారా.. చాలా డేంజర్ సుమీ..!

Hold In a Sneeze : చాలామంది తుమ్ములను బలవంతంగా ఆపుకుంటారు. తుమ్ములపై మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలానే నమ్మకాలు ఉంటాయి. పిల్లలు తుమ్మితే మన పెద్దలు “చిరంజీవ.. చిరంజీవ” అని అంటారు. ఎందుకంటే తుమ్మును పునర్జన్మగా భావిస్తారు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే.. ఆ పని అవ్వదని అంటారు. గడప మీద తుమ్మితే అశుభమని నమ్ముతుంటారు.


అంతే కాకుండా సినిమా హాళ్లలో, క్లాస్ మధ్యలో ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు తుమ్ము వచ్చినా ఆపుకుంటారు. ఎందుకంటే పక్కవారు ఏమైనా అనుకుంటారని భయం. తుమ్మును ఆపుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తుమ్ము ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. ముక్కు, గొంతులో ఏదైనా బాక్టీరియా చేరినప్పుడు అత్యంత వేగంగా శరీరం నుంచి బయటకు పంపేందుకు శరీరం చేసే ప్రతిస్పందనే తుమ్ము. అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం.. ఇది గంటకు 100 మైళ్ల వేగంతో ముక్కు నుంచి పదివేల బిందువులను విడుదల చేస్తుంది. తుమ్ము వల్ల కొంతసేపు గుండె చప్పుడు ఆగిపోయి.. కొట్టుకుంటుందనే నమ్మకం ఉంది. శాస్త్రీయంగా కూడా ఇది నిజమనే తేలింది. తుమ్మను బలవంతంగా ఆపితే ఏమౌతుందో తెలుసుకుందాం.


తుమ్ము మన శరీరానికి రక్షణ విధానం. ఇది నాసికా మార్గం నుంచి కొన్ని సెకన్లలోనే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. తమ్ము ఆపితే.. ఈ బ్యాక్టీరియా, దుమ్ము, ధూళిముక్కులోనే ఉండిపోతాయి. వీటి కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

తుమ్ము ఆపేందుకు ప్రయత్నించినప్పుడు ముక్కు, చెవి, గొంతు, మెదడు, కళ్లపై ఒక్కసారి ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా కర్ణభేరి పగిలిపోవడం కళ్లలోని చిన్న రక్తనాళాలు పగిలిపోయే ప్రమాదం ఉందని 2018లో BMJ కేస్ రిపోర్ట్స్‌లో కథనం ప్రచురించారు. బ్రిటన్‌‌కు చెందిన ఓ వ్యక్తి తుమ్ము బలవంతంగా ఆపుకోవడం వలన గొంతులో గాయమైంది.

తుమ్ములు.. ముక్కు, గొంతు నుంచి బ్యాక్టీరియాను తొలగించడానికి తోడ్పడుతుంది. తుమ్మును ఆపామంటే నాసికా భాగాల నుంచి గాలిని చెవులకు మళ్లిస్తుంది. ఇలా జరగడం వలన చెవిలో ఇన్ఫెక్షన్‌ జరగవచ్చు.

ముక్కు లోపల శ్లేష్మ పొర ఉంటుంది. శ్లేష్మ పొర వెనుక ఉన్న నరాలు ఎర్రబడి అక్కడ దురద ప్రారంభమైనప్పుడు తుమ్ములు వస్తాయి. జలుబు కారణంగా నరాలు వాపు సంభవిస్తుంది. దీని కారణంగా తుమ్ములు ఎక్కువగా వస్తాయి.

ఏదైనా పదార్థం ముక్కు లోపలికి వెళ్లినప్పుడు.. అక్కడి నరాలు అసౌకర్యంగా మారుతాయి. అప్పుడు ఆ పదార్థాన్ని బయటకు పంపడానికి శరీరం తుమ్ముల రూపంలో స్పందిస్తుంది. అలానే కొన్ని అలర్జీలు, పొగలు, దుమ్ము పీల్చడం వల్ల కూడా తుమ్ములు వస్తాయి.

తుమ్మిన తర్వాత మన శరీరం తేలికగా అనిపిస్తుంది. రీఫ్రెష్‌గా ఉంటాము. కానీ కొన్ని సందర్భాల్లో వైరస్ లేదా ఫ్లూతో బాధపడుతున్నప్పుడు తుమ్ములు వరుసగా వస్తాయి. అలాంటి తుమ్ములను ప్రమాదమైనవిగా గుర్తించాలి. వరుసగా తుమ్ములు రావడం వల్ల తల భారంగా మారుతుంది. ఇలాంటి సమయంలో తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.

గమనిక: ఈ కథనం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం మీ అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. తుమ్ము వచ్చినప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోండి. లేదంటే రోగాలు వ్యాపిస్తాయని నిపుణులు అంటున్నారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×