Big Stories

Herbal medicine : కీళ్లనొప్పులను తగ్గించే మూలిక వైద్యం.. దాంతో పాటు..

- Advertisement -

Herbal medicine : కొన్ని ఆరోగ్య సమస్యల కోసం పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడకుండా.. ప్రకృతిసిద్ధమైన వైద్యంపై కూడా ఆధారపడడం మంచిదని నిపుణులు చెప్తుంటారు. ఇమ్యూన్ సిస్టమ్‌ను పెంపొందించడానికి ఇలాంటి ప్రకృతి మార్గాలే మంచివని అంటుంటారు. ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్‌ను మెరుగుపరచడానికి టెక్నాలజీ వైద్యం కంటే ప్రకృతి సిద్ధమైన వైద్యమే మంచిదని ఇప్పటికీ నిపుణులు అభిప్రాయం. అందుకే ఒక ఆరోగ్య సమస్య కోసం అలాంటి ఒక పరిష్కారాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

- Advertisement -

అడవుల్లో, వెనబడిన ప్రాంతాల్లో మూలిక వైద్యం అనేది చాలా ఫేమస్. అందుకే ఆటోఇమ్యూనిటీ కోసం ఈ మూలిక వైద్యాన్ని నమ్ముకోవడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు. ఆటోఇమ్యూనిటీ బలహీనంగా ఉండడం వల్ల టైప్ 1 డయాబెటీస్‌తో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం, ఆటోఇమ్యూనిటీని బలపరచడం కోసం మూలిక వైద్యం బెటర్ అని శాస్త్రవేత్తలకు ఐడియా వచ్చింది. దానికోసం వారు ముందుగా ఆటోఇమ్యూన్ లోపం వల్ల కలిగే కీళ్లనొప్పుల వ్యాధిని ఎంపిక చేసుకున్నారు.

ముఖ్యంగా కీళ్లనొప్పులకు ప్రొటీన్ కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కామడ్2, కామడ్8 అనే ప్రొటీన్స్ వల్లే కీళ్లనొప్పులు అనేవి వస్తాయని వారు తెలిపారు. అయితే కామడ్3 వల్ల వచ్చే సమస్యలను అడ్డుకోవడానికి సెలాస్ట్రోల్ అనే ఒక మెడిసినల్ ప్లాంట్ ఉపయోగపడుతుందని వారి పరిశోధనల్లో తేలింది. దీనినే థండర్ గాడ్ వైన్ అని కూడా అంటారని తెలుస్తోంది. సెలాస్ట్రోల్‌ను ఉపయోగించడం వల్ల కామడ్3 వల్ల ఏర్పడే సమస్యలు చాలావరకు తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

సెలాస్ట్రోల్ అనేది ట్రిప్టెరీజియమ్ వైల్‌ఫోర్డీ అనే మెడిసినల్ ప్లాంట్స్ జాతికి చెందిన ఒక మూలిక అని, ఇది కేవలం కీళ్లనొప్పులకు మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా ఆటోఇమ్యూన్ లోపాలను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. కానీ కీళ్లనొప్పుల విషయంలో మాత్రం.. వాటి వ్యాప్తికి కారణమయ్యే ప్రొటీన్స్‌ను తగ్గించి.. కీళ్లనొప్పుల నుండి ఈ మూలిక ఉపశమనాన్ని అందిస్తుందని చెప్తున్నారు. అందుకే ఈ మూలికపై పూర్తిస్థాయి పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News