Big Stories

Health Problems Due To Salt : ఉప్పు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు.. ప్రత్యామ్నాయం ఏంటంటే..?

Health Problems Due To Salt

Health Problems Due To Salt : ఈరోజుల్లో ఉప్పు, కారం, మసాలాలు లాంటి ఎక్కువగా తినకూడదని, వాటి వల్లే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ రుచికరమైన ఆహారానికి అలవాటు పడిన మానవాళికి ఈ సూచనలు కష్టంగా అనిపిస్తున్నాయి. అందుకే ఎక్కువశాతం ఈ సూచనలను ఎవరూ పాటించడం లేదు. కొందరు మాత్రం వీటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. అలాగే ఉప్పుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధనలు చేపట్టారు.

- Advertisement -

ఉప్పు అనేది మనిషిలోని బ్లడ్ ప్రెజర్‌ను సులువుగా పెరిగేలా చేస్తుంది. బీపీ అనేది ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి హాని చేస్తుందని తెలిసిన విషయమే. అదే విధంగా బీపీ తక్కువగా కూడా ఉండకూడదు. అది కూడా మనిషిని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. అందుకే ఉప్పు వినియోగాన్ని తగ్గించి, దానికి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ అనేది తగ్గడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులకు కూడా మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇదే పలు స్టడీలలో కూడా వెల్లడయ్యింది.

- Advertisement -

బీపీ పెరగడం వల్లే చాలామంది గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు. దీని కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 10 మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉప్పు తగ్గించడం వల్ల సమస్య కొంతవరకు అయినా తగ్గుతుందని గమనించిన శాస్త్రవేత్తలు.. దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని కనుక్కునే పనిలోపడ్డారు. ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. అయితే ఇందులో సోడియం శాతాన్ని తగ్గించి దానిని పోటాషియంతో భర్తీ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి చాలావరకు తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

సోడియంను పోటాషియంతో మార్చడం వల్ల ముఖ్యంగా వృద్ధులలో గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఉప్పు వల్ల హైపర్‌టెన్షన్ లాంటి సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. అంతే కాకుండా దీని వల్ల కలిగే హార్ట్ ఎటాక్ లాంటి సమస్యలు కూడా పెరిగిపోతున్నాయని వారు అన్నారు. అందుకే ఉప్పు శాతాన్ని మనిషి శరీరంలో తగ్గించడం ఎంతైనా అవసరం అని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అందుకే వారు పొటాషియంను సోడియం స్థానంలో మార్చేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు.

సోడియం అనేది ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనిషి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రమాదం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయినా కూడా దీని ప్రమాదాన్ని తెలుసుకోకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రతీ ఆహార పదార్థంలో ఉప్పును ఎక్కువగా వేసుకుంటూ.. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. అందుకే ఉప్పులో సోడియంను తగ్గించి పొటాషియంను పెంచి.. అదే విధంగా ఉప్పును తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు టార్గెట్‌గా పెట్టుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News