EPAPER

Google : పైసా కట్టక్కర లేదు.. ఫ్రీగా 1టీబీ స్టోరీజి.. గూగుల్ యూజర్లకు పండగే

Google : పైసా కట్టక్కర లేదు.. ఫ్రీగా 1టీబీ స్టోరీజి.. గూగుల్ యూజర్లకు పండగే

Google : గూగుల్ యూజర్లకు నిజంగా ఇది గుడ్ న్యూసే. అంతేకాదు పెద్ద పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ 15 జీబీ ఉన్న గూగుల్ డ్రైవ్ వ్యక్తిగత స్టోరేజీని ఏకంగా 1 టీబీకి పెంచింది. అంటే 1,024 గిగాబైట్స్(జీబీ). ప్రస్తుతం ఉన్న 15 జీబీ కంటే ఇది 1,009 జీబీ ఎక్కువన్న మాట(1జీబీ = 1,024 కిలోబైట్స్-కేబీ). ఇందులో ఎంతైనా డేటా దాచుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, ప్రాజెక్ట్ వర్క్స్, పీడీఎఫ్ ఫైల్స్.. ఇలా దాదాపు 100 రకాల ఫార్మాట్లలో ఫైల్స్ ను గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. అవసరమైనప్పుడు వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్ లా కాకుండా ఎడిట్ చేసే ఆప్షన్ ని ఎనేబుల్ చేయనుంది గూగుల్. ఇక డౌన్ లోడ్ చేసుకుని… ఎడిటింగ్ చేసి మళ్లీ అప్ లోడ్ చేయొచ్చు.
గూగుల్ స్టోరీజీ 1టీబీ రావాలంటే ఏం చేయాలి? ఇది ఎలా వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చాలా ఈజీ. ఎందుకంటే జీమెయిల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ చాలా గూగుల్ ప్రొడక్ట్స్ యాక్సెస్ వస్తుంది. వీటితోపాటే గూగుల్ డ్రైవ్ కూడా వస్తుంది. దీని సామర్థ్యాన్నే గూగుల్ పెంచబోతోంది. దీని స్టోరీజీ సామర్థ్యాన్ని పెంచడానికి మనం ఏమీ చేయనక్కరలేదు. స్టోరీజీ పెంచాల్సిందిగా గూగుల్ ని అడగాల్సిన అవసరం కూడా లేదు. గూగుల్ వర్క్ స్పేస్ వ్యక్తిగత అకౌంట్లో ఆటోమేటిగ్గా అప్ గ్రేడ్ చేస్తుంది గూగుల్. ఈ గుడ్ న్యూస్ ని గూగుల్ తన బ్లాగ్ లో తాజాగా వెల్లడించింది. అంతేకాదు ఇది సురక్షిత క్లౌడ్ స్టోరేజీతో వస్తుందని కంపెనీ తెలిపింది. గూగుల్ డ్రైవ్ మాల్వేర్, స్పామ్, రాన్సమ్ వేర్ బారిన పడకుండా ఉండేందుకు బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ ఫీచర్లను తీసుకొస్తోంది.
1టీబీ స్టోరీజి అనేది గూగుల్ డ్రైవ్, జీమెయిల్ లకు వర్తిస్తుంది. దీంతో జీమెయిల్ ఫుల్ అవుతోంది… గూగుల్ డ్రైవ్ స్టోరీజి తగ్గిపోతోందనే టెన్షన్ ఉండదు. ఇదివరకు 15 జీబీ స్టోరేజీ నిండకముందే గూగుల్ అలర్ట్ చేసేది. ఎక్స్ ట్రా స్టోరేజీ కెపాసిటీని కొనుగోలు చేయాల్సిందిగా సూచించేది. ఇకముందు ఆ బెడద ఉండదు.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×