EPAPER
Kirrak Couples Episode 1

FIFA World Cup : ప్రీక్వార్టర్స్ చేరిన ఫ్రాన్స్‌

FIFA World Cup : ప్రీక్వార్టర్స్ చేరిన ఫ్రాన్స్‌

FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ అదరగొట్టింది. డెన్మార్క్‌పై 2-1 గోల్స్ తేడాతో గెలిచిన ఫ్రాన్స్… గ్రూప్‌-Dలో వరుసగా రెండో విజయంతో… ఈ వరల్డ్‌కప్‌లో నాకౌట్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది.


ఫిఫా వరల్డ్‌కప్‌ గ్రూప్-Dలో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన ఫ్రాన్స్… డెన్మార్క్‌తో హోరాహోరీగా సాగిన రెండో మ్యాచ్‌లోనూ అద్భుత విజయం సాధించింది. ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపె డబుల్ గోల్స్‌ చేయడంతో… ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ ఆరంభం నుంచే డెన్మార్క్‌పై ఫ్రాన్స్‌ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఎటాకింగ్ గేమ్‌తో ఆద్యంతం ప్రమాదకరంగా కనిపించిన ఫ్రాన్స్… డెన్మార్క్‌ను పూర్తి ఆత్మరక్షణలో పడేసింది. తొలి అర్ధభాగంలో… 10వ, 21వ, 41వ నిమిషాల్లో ఫ్రాన్స్ చేసిన గోల్ ప్రయత్నాలను డెన్మార్క్ సమర్థంగా అడ్డుకుంది. డెన్మార్క్‌ కూడా రెండు గోల్ ప్రయత్నాలు చేసి విఫలం కావడంతో… ఫస్ట్ హాఫ్ గోల్ నమోదు కాకుండానే ముగిసింది.

రెండో అర్థభాగంలోనూ డెన్మార్క్‌పై దాడులు కొనసాగించిన ఫ్రాన్స్‌… 61వ నిమిషంలో సఫలమైంది. ఎంబాపె చేసిన సూపర్‌ గోల్‌తో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎడమ వైపు నుంచి డెన్మార్క్‌ గోల్ పోస్ట్ వైపు దూసుకెళ్లిన ఎంబాపె… హెర్నాండెజ్‌ దిశగా బంతిని పంపి నెట్‌కు మరింత చేరువగా వెళ్లాడు. డెన్మార్క్‌ డిఫెండర్లను తప్పిస్తూ హెర్నాండెజ్‌ బంతిని తిరిగి ఎంబాపెకు పంపగా… గోల్ పోస్టుకు చాలా దగ్గరి నుంచి బంతిని నెట్ లోపలికి పంపాడు… ఎంబాపె. అయితే, ఆధిక్యంలోకి వెళ్లామన్న ఫ్రాన్స్ ఆనందం ఐదు నిమిషాల్లోనే ఆవిరైంది. 68వ నిమిషంలో గోల్ చేసిన డెన్మార్క్ ఆటగాడు క్రిస్టెన్సన్‌… 1-1 గోల్స్ తో స్కోరు సమం శాడు. ఎరిక్సన్‌ కార్నర్‌ కిక్‌ను అతను హెడర్ గోల్‌గా మలిచాడు. మరో ఐదు నిమిషాల్లో ఇంకో గోల్‌తో డెన్మార్క్ ఆధిక్యంలోకి వెళ్లేదే. కానీ… ఫ్రాన్స్ ఆటగాళ్లు డెన్మార్క్‌ రెండో గోల్‌ ప్రయత్నాన్ని సమర్థంగా అడ్డుకున్నారు. రెండు జట్లూ హోరాహోరీగా తలపడుతుండటంతో… మ్యాచ్‌ డ్రా అవుతుందేమో అని అనిపించింది. కానీ ఆట మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా… ఎంబాపె మరో గోల్‌తో డెన్మార్క్‌కు షాకిచ్చాడు. గోల్‌ పోస్టుకు అతి సమీపంలోకి గ్రీజ్‌మన్‌ ఇచ్చిన క్రాస్‌ను… ఎంబాపె గోల్‌గా మలిచాడు. అంతే… ఫ్రాన్స్‌ ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. చివరి వరకు 2-1 గోల్స్ తేడాతో ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న ఫ్రాన్స్… డెన్మార్క్‌పై గెలుపుతో నాకౌట్ చేరింది.


Related News

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ యుద్దం – తనను ఎవ్వరూ ఓడించలేరని అంజు ఫోజులు

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. మరో ఇద్దరు అరెస్ట్?

Big Stories

×