EPAPER

Foxconn: అంతా పీకేస్తుంటే.. ఆ కంపెనీ ఇస్తానంటోంది..

Foxconn: అంతా పీకేస్తుంటే.. ఆ కంపెనీ ఇస్తానంటోంది..

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో పెరుగుదల… ఆయాదాల్లో క్షీణత కారణంగా ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీలు ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. ఇటీవల మెటాలో 11 వేల మంది, ట్విట్టర్లో దాదాపు 4 వేల మంది, అమెజాన్ లోనూ వందల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దాంతో… తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడతాయోనన్న భయం… ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీల ఉద్యోగుల్లోనూ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకు తీపికబురు చెప్పింది… ఫాక్స్‌కాన్‌. దేశంలో వచ్చే రెండేళ్లలో కొత్తగా 53 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు తెలిపింది.


చైనాలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో… ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ అయిన జెంగ్‌జౌ ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ వద్ద కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాంతో అక్కడ ఐఫోన్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి… వాటి షిప్‌మెంట్‌ను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకే చైనాపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించుకునే ఆలోచన చేస్తోంది… ఫాక్స్‌కాన్‌. అందుకు భారత్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. డిమాండ్‌ను అధిగమించేందుకు… ఇండియాలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగులను పెంచుకోబోతోంది… ఫాక్స్‌కాన్. చెన్నైలోని ప్లాంట్ లో వచ్చే రెండేళ్లలో దశల వారీగా కొత్తగా 53 వేల మందిని చేర్చుకుని… మొత్తం ఉద్యోగుల సంఖ్యను 70 వేలకి పెంచాలని ఫాక్స్‌కాన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

2019లో చెన్నైలో ఐఫోన్ల ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించింది… ఫాక్స్‌కాన్. క్రమంగా ఉత్పత్తిని పెంచుకుంటూ వెళ్తూ… ఈ ఏడాది కొత్త మోడల్ అయిన ఐ ఫోన్ 14 సిరీస్ ఫోన్లనూ ఉత్పత్తి చేస్తోంది. అయితే చైనాలోని ప్లాంట్ తో పోలిస్తే… ఇక్కడ ఉత్పత్తి చాలా తక్కువ. ఫాక్స్‌కాన్ కు జెంగ్‌జౌ ప్లాంట్‌లో 2 లక్షల కార్మికులుంటే… ఇక్కడ వేల సంఖ్యలోనే ఉన్నారు. కానీ… చైనా ప్లాంట్ తర్వాత ఫాక్స్‌కాన్ కు చెన్నై ప్లాంటే చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని ఫాక్స్‌కాన్ భావిస్తుండటంతో… దేశంలో నిరుద్యోగుల సంఖ్య కాస్తైనా తగ్గుతుందని భావిస్తున్నారు.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×