EPAPER

Food Label : ఫుడ్ ప్యాకెట్స్ కొంటున్నారా ?.. ఇది చూడకుంటే మీ ఆరోగ్యం గుల్లే..!

Food Label : మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మంచి ఆహారం తినాలి. కానీ ఇప్పుడు అంతా రెడి టూ ఈట్, రెడీ టూ కుక్ ఫుడ్ ఎక్కువైంది.

Food Label : ఫుడ్ ప్యాకెట్స్ కొంటున్నారా ?.. ఇది చూడకుంటే మీ ఆరోగ్యం గుల్లే..!

Food Label : మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మంచి ఆహారం తినాలి. కానీ ఇప్పుడు అంతా రెడీ టూ ఈట్, రెడీ టూ కుక్ ఫుడ్ ఎక్కువైంది. అలానే తాగే జ్యూసుల నుంచి ఆయిల్ ప్యాకెట్లు వరకు రకరకాలు ఫుడ్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది.


వాటిని కొనేముందు ఆ ఫుడ్ ప్యాకెట్స్‌పై ప్రింట్ చేసిన లేబుల్స్ మీలో ఎవరైనా చదువుతున్నారా? మీరు తినే చిప్స్ ప్యాకెట్స్‌లో ఎంత కొవ్వు, ఎన్ని కార్బొహైడ్రేట్లు ఉన్నాయో మీ దగ్గరా సమాధానం ఉందా? మార్కెట్‌లో పూర్తిగా ప్రాసెస్ చేసినవి, కొంత వరకు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ప్యాకెట్ల రూపంలో అందుబాటులో ఉన్నాయి. మరి మంచి ఫుడ్‌ని మార్కెట్ నుంచి ఎలా ఎంచుకుంటున్నారు?.

మన దేశంలోని పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుతున్న మొత్తం కేలరీల్లో.. సగటున 10 శాతం కొంత వరకు ప్రాసెస్ చేసిన ఆహారమే. పట్టణ ప్రాంతాల్లో అయితే ఇది 30 శాతం వరకు ఉంటుందని మెడికల్ లాన్సెల్ నివేదిక పేర్కొంది.


వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2021 లెక్కల ప్రకారం.. దేశంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల మార్కెట్ విలువ సుమారుగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు.

అదే విధంగా మార్కెట్ రీసెర్చ్ కంపెనీ యూరోమానిటర్ డేటా ప్రకారం.. కొంతమేర ప్రాసెస్ చేసిన ఫుడ్ ప్యాకెట్ల విక్రయాలు చిన్న కిరాణా షాపుల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి.

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధనల ప్రకారం.. దేశంలో గత రెండు దశాబ్ధాల్లో ఊబకాయం, బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి కారణం ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలే. వీటి వినియోగం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సమానంగా ఉంది.

ఈ ప్యాకెజ్డ్ ఫుడ్.. తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకానీ అందులో ఎలాంటి పోషకాలు ఉండవు. వీటిలో షుగర్, ఉప్పు ఉంటుంది. ఇటువంటి ఆహారం తీసుకున్న మన శరీరానికి ఎలాంటి కేలరీలు అందవు.

ఫుడ్ సేఫ్గీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం.. విక్రయించిన ప్రతి ఫుడ్ ప్యాకెట్‌ ప్రీ ప్యాకెడ్, ప్రాసెస్డ్ ఫుడ్ దానికి సంబంధించిన పోషకాహార సమచారం పూర్తిగా ముద్రించి ఉండాలి. దీని ప్రకారం అవి కొనాలో వద్దో వినియోగదారులే నిర్ణయించుకోవాలి.

ఇలా ప్యాకెట్లపై ముద్రించడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్యాకేజ్డ్ ఫుడ్‌లో కొవ్వులు, చక్కెర, ఉప్పు నిర్దేశిత దాని కంటే ఎక్కువ ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.

మీరు ఫుడ్ ప్యాకెట్ కొనేముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు..

  • ఆహార పదార్థాలు మీ జీర్ణశ్రయాన్ని సంరక్షించేలా ఉండాలి. అలువంటి ఫుడ్ కాలేయాన్ని రక్షించడంతోపాటు మీ మెదడుకు కూడా బలాన్ని ఇస్తుంది.
  • మీరు తీసుకునే ఆహారంలో తగినంత ఫైబర్ ఉండాలి. ఇది మీ జీర్ణాశ్రయం, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • షుగర్ ఉండే ఫుడ్‌ను తీసుకోవద్దు. షుగర్ ఉండే పదార్థాలు కాలేయంపై ప్రభావం చూపుతాయి. షుగర్ వలన చాలా మందికి ఫ్యాటీ లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి.
  • ఒమేగా 3 యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోండి. ఇవి మెదడుకు చాలా ముఖ్యం. వీటిలో ఏ ఒక్కటి లేని ఫుడ్ ప్యాకెట్లను అస్సలు కొనద్దు.

ఆరోగ్యానికి హాని కలిగించే ఫుడ్ ప్యాకెట్లపై రెడ్ కలర్ లేబుల్ ముద్రించాలని ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐకి సీఐఐ పేర్కోంది. అయితే ఈ రెడ్ కలర్ లేబుల్ ముద్రించడానికి ఇండస్ట్రీలు ఇష్టపడడం లేదు. డేంజర్‌కు సూచనగా రెడ్ కలర్ ఉంటుందని.. ఇది సేల్స్ పడిపోడానికి కారణమవుతుందని అంటున్నారు.

Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×