EPAPER

Tips Will Improve Your Memory : ఈ టిప్స్‌ పాటిస్తే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది

Tips Will Improve Your Memory : ఈ టిప్స్‌ పాటిస్తే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
Tips Will Improve Your Memory

Tips Will Improve Your Memory : ప్రస్తుత కాలంలో మన లైఫ్‌స్టైల్‌తో ఎన్నో జ్ఞాపకశక్తి సమస్యలను ఎదుర్కొంటున్నాం. యుక్త వయస్సులోనే అనేక సమస్యలు వస్తున్నాయి. దీంతో జీవితంలో ముందుకెళ్లలేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెదడు జ్ఞాపకాల్ని సంకేతాల రూపంలో భద్రపరుచుకుంటుంది. మనకు అవసరమైన సందర్భాల్లో జ్ఞాపకాలను యధాతథంగా అందిస్తుంది. అయితే ఎన్నో అవరోధాలు, ఆరోగ్య సమస్యల వల్ల మతిమరుపు వస్తుంది. ఇది అల్జీమర్స్‌ వరకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. తెలిసిన వ్యక్తి పేరును మర్చిపోవడం, చేసిన పనే మళ్లీ మళ్లీ చేయడంలాంటివి జ్ఞాపకశక్తి శక్తిలో వచ్చే మార్పులు. జ్ఞాపకశక్తి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా జ్ఞాకపశక్తి తగ్గుతుంది. శారీరక శ్రమ మెదడుకు మంచి ఆక్సిజన్‌ను ఇవ్వడమే కాకుండా మెరుగైన రక్త ప్రసరణలో కూడా సహాయపడుతుంది. పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రించే వరకు ఏదో ఒక పనిచేస్తూ మన శరీరాన్ని యాక్టీవ్‌గా ఉంచుకోవాలి. ఎంత ఎక్కువ పనిచేస్తే మెదడు కూడా అంత బలంగా తయారవుతుంది. అందుకే కొత్త భాష, సంగీతం, ఆర్ట్‌ వేయడంలాంటి పనుల వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. క్రాస్‌వర్డ్ పజిల్స్‌, సుడోకు లాంటి ఆటలను ఆడటం, సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచనలు కూడా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కొత్త సమాచారాన్ని సేకరించేటప్పుడు మైండ్ ప్యాలెస్, జ్ఞాపిక పరికరాలు, ఎక్రోనిమ్స్‌ వంటి సాధనాలను ఉపయోగించడంతో మరింత సమర్థవంతంగా జ్ఞాపకాలను నిల్వచేయవచ్చు. మైండ్ ప్యాలెస్.. అంటే మనకు బాగా తెలిసిన ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ ప్రదేశాలను నెమరువేసుకోవాలి, అంతేకాకుండా వాటికి ఇంకొన్ని వివరాలను జోడించడం. జ్ఞాపకాలు, ఎక్రోనిమ్స్‌ సంక్షిప్తంగా నిల్వ చేసుకుని తిరిగి పొందడాన్ని సులభతరం చేసే కొన్ని టెక్నిక్స్‌. సేకరించిన కొత్త సమాచారాన్ని ఇప్పటికే తెలిసిన అంశాలతో జత చేయాలి. వీటి ద్వారా పొందే కొత్త సమాచారాన్ని మెమరీలో నిల్వ చేసుకుంటూ వెళ్తుండాలి. ఇది జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో ఎంతో సాయపడుతుంది. కొత్త సమాచారం ఇంతకు ముందు నేర్చుకున్న దానితో ఎలా సంబంధం కలిగి ఉందో విశ్లేషించడం వల్ల కూడా మెదడుకు పదును పెట్టడానికి అవకాశం లభిస్తుంది. రాత్రి నిద్ర పోయే ముందు న్యూస్‌ పేపర్‌, మ్యాగజైన్‌ చదవడం అలవాటు చేసుకోవాలి. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. పాలకూర, గోంగూర, మునగ, క్యారెట్‌, గోబి తినాలి. చీజ్‌, పాలు,పెరుగు, బట్టర్‌ లాంటి కాల్షియం ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవాలి. ప్రతిరోజు భోజనం తర్వాత గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం యోగా, మెడిటేషన్‌తో పాటు తేలికపాటి వ్యాయామాలు చేయాలి.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×