Big Stories

Sodium iron Batteries : సోడియమ్ ఐరన్ బ్యాటరీలపై ప్రయోగం.. మరింత మెరుగ్గా..

- Advertisement -

Sodium iron Batteries : ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్నకొద్దీ వారి అవసరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆ అవసరాలకు తగినట్టుగానే వనరులను అందించాలని శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని విషయాల్లో వనరులకు ప్రత్యామ్నాయాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా జనాభా పెరుగుతున్న క్రమంలో అందరికీ కరెంటు అవసరాలు అనేవి పెరిగిపోయాయి. అదే విధంగా బ్యాటరీ అవసరాలు కూడా. అందుకే శాస్త్రవేత్తలు ఓ నిర్ణయానికి వచ్చారు.

- Advertisement -

ప్రస్తుతం చాలావరకు దేశాల్లో ఎక్కువగా సోడియమ్ ఐరన్ బ్యాటరీలనే ఉపయోగిస్తున్నారు. దీని బదులుగా వేరే ఇతర బ్యాటరీల తయారీల గురించి కూడా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నా.. సోడియన్ ఐరమ్ బ్యాటరీలలాగా అవేవి మెరుగ్గా పనిచేయవని వారు భావిస్తున్నారు. అందుకే ఈ బ్యాటరీలనే మరింత మెరుగుపరచాలని వారు అనుకుంటున్నారు. అందుకే ఈ బ్యాటరీలలో హై పర్ఫార్మెన్స్ క్యాథోడ్ మెటీరియల్స్‌ను పొందుపరచాలని వారు సన్నాహాలు మొదలుపెట్టారు.

ఇప్పటికీ సోడియమ్ ఐరన్ బ్యాటరీలలో క్యాథోడ్ మెటీరియల్స్‌నే ఉపయోగిస్తున్నా.. వాటిని మరింత మెరుగ్గా తయారు చేయాలన్నదే శాస్త్రవేత్తలు ప్రయత్నం. పైగా ఇవి తక్కువ కాస్ట్‌తో అందుబాటులోకి వచ్చేలాగా వారు ప్రయత్నిస్తున్నారు. కస్టమర్ల ఎలక్ట్రానిక్ పరికరాలలో, గ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్ విషయంలో, స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ విషయంలో ఈ మెరుగైన సోడియమ్ ఐరన్ బ్యాటరీలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఇండియాలో సోడియమ్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బ్యాటరీలపై ఎలాంటి ప్రయోగాలు చేయడానికి అయినా తగినంత సహకరాం దొరుకుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

ఇప్పటికే ఇండియాలోని ఐఐటీ బొంబాయి లాంటి యూనివర్సిటీలు నా ఐరన్ బ్యాటరీలను తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన డిజైన్‌ను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇవి సక్సెస్ అయితే నా ఐరన్ బ్యాటరీలు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా, హై పర్ఫార్మెన్స్‌తో పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాంతో పాటు హై పర్ఫార్మెన్స్ క్యాథోడ్ మెటీరియల్స్‌తో తయారయ్యే ఈ సోడియమ్ ఐరన్ బ్యాటరీలు కూడా బ్యాటరీల కొరతను తగ్గించడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News