EPAPER

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Exist Polls Result 2024: హర్యానాలో పాగా వేయాలన్న కాంగ్రెస్ కల నెరవేరనుందా.. విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ నేతల చిగురించాయా.. అలాగే జమ్ముకాశ్మీర్ కూడా కాంగ్రెస్ కోటమి వశం కానుందా అంటే అవుననే చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసిన అనంతరం పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించింది. కాగా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 8న ఫలితాలు విడుదల కానుండగా.. ఎగ్జిట్ పోల్స్ ప్రకటనతో ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ కార్యాలయం వద్ద సందడి నెలకొంది.


హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. బరిలో మొత్తం 1031 మంది అభ్యర్థులు నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు సాగగా.. 61 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక్కడ పాగా వేయాలని మూడు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేశాయి. అందుకే బీజీపీ – కాంగ్రెస్ – ఆప్ పార్టీల మధ్య ప్రధాన పోటీ సాగింది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉండగా, మెజారిటీకి 46 సీట్లు అవసరం. అయితే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో అన్ని సీట్లపై త్రికోణ పోటీ నెలకొనగా.. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు విసృతంగా ప్రచారం నిర్వహించాయి.

Also Read: Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్


ఈసారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నం చేసింది. హర్యానా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు పార్టీల కీలక నేతలు పార్టీలో చేరడంతో కాంగ్రెస్ నాయకులు ఫుల్ జోష్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసిన అనంతరం.. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో 55 స్థానాలలో కాంగ్రెస్ విజయదుంధుభి మోగిస్తుందని వెల్లడైంది. అలాగే బీజేపీ-26, ఇతరులు 3-5 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుపుతున్నాయి. ఇదే నిజమైతే పొత్తు లేకుండా కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోనుంది. కాగా ముచ్చటగా మూడోసారి తమదే అధికారం అంటూ బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే జమ్ముకాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ కూటమికే అధికారం చేజిక్కనుందని ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఇక్కడ ఓటింగ్ ప్రశాంతంగా సాగేలా ఎన్నికల కమిషన్ పకడ్బందీగా చర్యలు తీసుకుంది. దీనితో కాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. కాగా మూడు విడతలుగా ఎన్నికలు జరగగా.. 90 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులు పోటీ చేశారు.

ఇటీవల నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో పోల్చితే అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగా పెరిగింది. పీడీపీ, కాంగ్రెస్ కూటమి, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఎన్నికలు పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా.. కాంగ్రెస్ కూటమికి అధికారం చేజిక్కనుందని తెలుస్తోంది. కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ కూటమికి 46 నుండి 50 స్థానాలలో గెలుపు ఖాయమని, బీజేపీకి 20 నుండి 27, పీడీపీ 7-11 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అయితే హర్యానా, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం ఈ నెల 8న ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది. ఫలితాల విడుదల ఆనంతరమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవమా.. కాదా అనేది తేలే అవకాశం ఉంది.

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×