EPAPER
Kirrak Couples Episode 1

Epilepsy:- సంగీతంతో ఆ వ్యాధికి చికిత్స.. సక్సెస్‌ఫుల్‌గా పరిశోధనలు..

Epilepsy:- సంగీతంతో ఆ వ్యాధికి చికిత్స.. సక్సెస్‌ఫుల్‌గా పరిశోధనలు..

Epilepsy:- మనిషికి వచ్చే అన్ని వ్యాధులలో మెదడుకు సంబంధించిన వ్యాధులే క్లిష్టమైనవని వైద్య నిపుణులు చెప్తుంటారు. ఎందుకంటే టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ఇప్పటివరకు చికిత్స అందించలేకపోతున్న ఎన్నో వ్యాధులు మెదుడుకు సంబంధించినవే. అలాంటి వ్యాధులలో ఒకటి ఎపిలెప్సీ. అసలు ఈ ఎపిలెప్సీని అరికట్టే మార్గమే లేదా అని టోరంటోలోని ఒక శాస్త్రవేత్తకు సందేహం కలిగింది. అందుకే ఎన్నో ఏళ్లుగా ఈ టాపిక్‌పై పరిశోధలనలు చేస్తూనే ఉన్నారు.


తౌషిక్ వాలియంట్ ఒక సీనియర్ సైంటిస్ట్. తన చిన్నప్పుడు తన బేస్‌బాల్ కోచ్ కుమారుడు ఎపిలెప్సీతో చనిపోవడం చూసిన తౌఫిక్.. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు. ఆ సంఘటనే తనపై బలమైన ముద్ర వేసిందని, అందుకే సైంటిస్ట్ అయిన తర్వాత ముందుగా ఆ కోణంలో పరిశోధనలు మొదలుపెట్టానని తౌఫిక్ అంటున్నారు. ముందుగా న్యూరోసర్జన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన తౌఫిక్.. అదే సమయంలో మ్యూజిక్‌కు, ఎపిలెప్సీకి దగ్గర సంబంధం ఉందని గమనించారు.

మ్యూజిక్‌కు, ఎపిలెప్సీకి ఉన్న సంబంధాన్ని మరింత క్షుణ్ణంగా తెలుసుకునే దిశగా పరిశోధనలు మొదలయ్యాయి. అప్పుడే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి. రోజుకు ఆరు నిమిషాలు మోజార్ట్ యొక్క కే448 మ్యూజిక్‌ను, రెండు పియానోలతో కలిపి డీ మేజర్‌లో వాయించిన సంగీతాన్ని విన్న ఎపిలెప్సీ పేషెంట్లలో మూర్ఛ రావడం 35 శాతం తగ్గిపోయినట్టు గమనించారు. ఈ రీసెర్చ్ కోసం ఎన్నో వేలమంది సంగీత కళాకారులు, వారి పాటలు, మ్యూజిక్ కంపోషిన్స్‌ను స్టడీ చేశారు.


సంగీతంతో ఎపిలెప్సీ అదుపులోకి వస్తుందని తెలుసుకున్న తర్వాత తౌఫిక్.. ఇతర పెద్ద పెద్ద యూనివర్సిటీలతో, శాస్త్రవేత్తలతో చేతులు కలిపి ఈ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లనున్నారు. మ్యూజిక్ అనేది మ్యాథ్స్ లాంటిదని, అందుకే సంగీతంలోని కొన్ని శబ్దాలు విన్నప్పుడు మెదడుకు మూర్ఛ నుండి విముక్తి కలుగుతుందని ఆయన పరిశోధనలో తేలిందన్నారు. ఎపిలెప్సీ అనేది మెదడు గురించి స్టడీ చేయడానికి ఎంతగానో ఉపయోగపడే ఒక వ్యాధి అని, దాని గురించి తెలుసుకునే క్రమంలో తనకు సహకరించిన పేషెంట్లకు ధన్యవాదాలు తెలిపారు.

సోలార్ స్టార్మ్‌ను శాస్త్రవేత్తలు ఎందుకు కనిపెట్టలేదంటే..?

for more updates follow this link:-Bigtv

Related News

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×