EPAPER

Earth Inner Core Came:రొటేషన్ ఆపేసిన భూభాగం.. కారణం ఏంటంటే..?

Earth Inner Core Came:రొటేషన్ ఆపేసిన భూభాగం.. కారణం ఏంటంటే..?

Earth Inner Core Came:స్పేస్ స్టడీ అనేది అందరికీ ఆసక్తికరమైన అంశమేమీ కాదు. దీని మీద ఆసక్తి ఉన్నవారు మాత్రమే అసలు అంతరిక్షంలో ఏం జరుగుతుంది, సోలార్ సిస్టమ్‌లో వచ్చిన మార్పులేమిటి అనేవాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో చాలావరకు శాస్త్రవేత్తలు, ఆస్ట్రానాట్సే ఉంటారు. తాజాగా శాస్త్రవేత్తలు భూమి తన భ్రమణాన్ని ఆపేసిట్టుగా గుర్తించారు.


భూమి అనేది తనకు తానుగా తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ఫిజిక్స్‌లో మనం చదువుకున్నాం. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ప్రక్రియ నిలకడగానే ఉన్నా.. తనకు తానుగా తిరిగే ప్రక్రియలో మాత్రం మార్పులు వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే ఈ విషయంలో లోతుగా పరిశోధనలు జరిపారు. అందులో భూమి మధ్య భాగం అంటే కోర్ భాగం తిరగడం ఆగిపోయిందని తేలింది.

భూగ్రహం అనేది చాలా పెద్దది. మానవాళి అనేది కేవలం దీని పైభాగంలో నివసిస్తూ ఉన్నాం. కానీ బావుల పేర్లతో, మైనింగ్, డ్రిల్లింగ్ పేర్లతో, క్రూడ్ ఆయిల్ పేర్లతో భూమిని ఎంత వీలైతే అంత తవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అంతే కాకుండా అండర్‌గ్రౌండ్‌లో మెట్రో స్టేషన్స్, టన్నల్స్ లాంటివి ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా చాలావరకు భూ పైభాగం వరకే పరిమితమవుతున్నాయి.


భూపైభాగాన్ని క్రస్ట్ అంటాం. ఈ క్రస్ట్ దాదాపు 40 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఇప్పటివరకు మనిషి ఎంత కష్టపడినా 12 కిలోమీటర్లకంటే ఎక్కువ లోతుకు చేరుకోలేకపోయాడు. క్రస్ట్ తర్వాత భాగాన్ని మ్యాంటిల్ అంటాం. ఇది 2,890 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఇప్పటివరకు మనుషులు ఈ లేయర్ ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయారు. కేవలం సీస్‌మోలాజికల్ స్టడీ ద్వారానే మ్యాంటిల్ గురించి తెలిసింది.

మ్యాంటిల్ తర్వాత వచ్చేదే కోర్. అంటే భూమి మధ్య భాగం. ఇది భూ గ్రహానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. ఐరన్, నికల్ లాంటి వాటితో సూర్యుడిపై ఉండేంత ఉష్ణోగ్రతతో ఉంటుంది ఈ కోర్. ఇందులో ఇన్నర్ కోర్ గట్టిగా, ఔటర్ కోర్ మాత్రం లిక్విడ్ లాగా ఉంది. లిక్విడ్ కోర్ కాకుండా ఇన్నర్ కోర్ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అంటే భూ గ్రహంలోపల మరో భూమి తిరుగుతున్నట్టుగా ఉంటుంది.

న్యూక్లియర్ బాంబు దాడి జరిగినప్పుడు దాని ప్రభావం కోర్ వరకు చేరుకుంది. ఆ సందర్భంలో శాస్త్రవేత్తలకు కోర్ గురించి స్టడీ చేయడానికి అవకాశం దొరికింది. ఇన్నర్ కోర్ అనేది ఏడాదికి 0.15 డిగ్రీల వేగంతో తిరుగుతుందని వారు కనుక్కున్నారు. ఇప్పటికీ దీనిపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇన్నర్ కోర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పీడ్‌లో తిరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఇప్పుడు అది తిరగకుండా నిలకడగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది పూర్తిగా ఆగిపోలేదని కూడా కొందరు అంటున్నారు. భూ గ్రహం తిరిగే స్పీడుకు, ఇన్నర్ కోర్ తిరిగ స్పీడుకు పలు కారణాల వల్ల వ్యత్యాసం ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

ఇన్నర్ కోర్ తిరగడం ఆగిపోవడాన్ని గమనించిన శాస్త్రవేత్తలు ఇది పర్యావరణ మార్పులకు సూచన అయ్యిండవచ్చని కూడా భావిస్తున్నారు. అలా అయితే కొన్నాళ్లకు భూ గ్రహం మానవాళి నివసించడానికి సహకరించదని కొందరు ఊహిస్తున్నారు. కోర్‌లో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించడానికి టెక్నాలజీ లేకపోవడంతో.. పర్యావరణాన్ని కాపాడడమే దీనికి పరిష్కారమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమిని మనం కాపాడితే భూమి మనల్ని కాపాడుతుందని వారు అంటున్నారు.

Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×