EPAPER

Dog Bite : ప్లీజ్ బ్రో.. కుక్కల పెంపకంలో ఇలా చేయొద్దు..!

Dog Bite : కుక్క పేరు వినగానే గుర్తొచ్చేది విశ్వాసం. అటువంటి కుక్కను చేస్తే నేడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యకాలంలో మనుషులపై కుక్కల దాడులు అధికమయ్యయి. కానీ మనకు కనిపించే ప్రతి కుక్క కరవదు. వాటి భావోద్వేగాలను బట్టి దాడుటు చేస్తుంటాయి. అసలు కుక్కలు ఎందుకు దాడి చేస్తాయి. పెండుడు కుక్కలు, వీధి కుక్కలు కరవడంలో తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Dog Bite : ప్లీజ్ బ్రో.. కుక్కల పెంపకంలో ఇలా చేయొద్దు..!

Dog Bite: కుక్క పేరు వినగానే గుర్తొచ్చేది విశ్వాసం. అటువంటి కుక్కను చూస్తే నేడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యకాలంలో మనుషులపై కుక్కల దాడులు అధికమయ్యయి. కానీ మనకు కనిపించే ప్రతి కుక్క కరవదు. వాటి భావోద్వేగాలను బట్టి దాడుటు చేస్తుంటాయి. అసలు కుక్కలు ఎందుకు దాడి చేస్తాయి. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు కరవడంలో తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రతీ కుక్క కొంత ప్రాంతాన్ని తనదిగా భావిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో ఓవైపు మానవ జనాభా పెరిగిపోతుంది. మరోవైపు కుక్కల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కుక్కలు తమదిగా భావించే ప్రాంత విస్తీర్ణం తగ్గిపోతోంది. దీంతో వాటిలో అభద్రతాభావం పెరుగుతుంది. మానవులు మా స్థలాన్ని ఆక్రమించారని భావిస్తాయి. అలాంటి సమయంలో దాడి చేసే ప్రమాదం ఉంది.

కుక్కలు కొన్ని సందర్భాల్లో ప్రజల్ని భయపెట్టడాన్ని ఆటలా చూస్తాయి. కుక్కలు వెంటపడినప్పుడు ప్రజలు పరుగులు తీస్తారు. తద్వారా ప్రజలు తమకు భయపడుతున్నారని తెలుసుకుంటాయి. ఈ క్రమంలో కుక్కలు కరుస్తాయి. అదే విధంగా ఉష్ణోగ్రతలు పెరగడం, పెద్ద శబ్ధాలు, ప్రకాశవంతమైన లైట్లు, తిండి దొరక్కపోవడం వంటి కారణాల వల్ల కూడా కుక్కలు కరుస్తాయి.


పెంపుడు కుక్కలు ఎందుకు కరుస్తాయి..?

కుక్క పిల్లలు రెండు, మూడు నెలల వయసులో బుజ్జిగా ఉన్నప్పడు ప్రతీ వస్తువును నోటితో పట్టుకుంటాయి. వాటికి అప్పుడప్పుడే దంతాలు వస్తుంటాయి. దీని వల్లనే అన్నింటిని నోటితో పట్టుకుంటాయి. ఈ సమయంలో యజమానులు వాటిని ఆపరు. అవి ఆడుకుంటున్నాయని భావించి ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాటికి అదొక అలవాటుగా మారుతుంది. నిజానికి ఇది వాటికి మంచి అలవాట్లు నేర్పించాల్సిన వయస్సు.

చాలా మంది కుక్కలను తెచ్చుకొని వాటిని ఇంట్లో ఏదొక మూలన కట్టేస్తారు. ఇలా చేయడం వల్ల కుక్కలు అభద్రతాభావానికి గురవుతాయి. అలాంటి సమయంలో పరిచయం లేని వ్యక్తులు ఎదురైనప్పుడు దాడి చేసే ప్రమాదం ఉంది. పెంపుడు కుక్కలకు వాటికి సరిపడదానికంటే అధికంగా ఆహారం పెడుతుంటారు. వాటికి ఎక్కువగా శారీరక శ్రమ కూడా ఉండదు. శరీరంలోని శక్తి కూడా ఖర్చవదు. దీంతో అవి దూకుడుగా మారి దాడి చేస్తాయి. ఆహారం, పానీయాల్లో అసమతుల్యత కూడా అవి దాడి చేయడానికి కారణం కావచ్చు.

పెంపుడు కుక్క, వీధి కుక్కలు కరవడంలో ఎలాంటి తేడా ఉంటుంది..?

సాధారణంగా పెంపుడు కుక్కలు దూకుడుగా వ్యవహరించినప్పుడు తాము తప్పు చేశామని గ్రహించే గుణం ఉంటుంది. అందుకే అవి కరవగానే వెనక్కి తగ్గుతాయి. అదే వీధి కుక్కలు అయితే ఇలా ఉండవు. వాటికి వేటాగే గుణం ఉంటుంది. పుట్టుకతోనే వాటికి కరవాలనే గుణం ఉంటుంది. పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్లు వేయిస్తారు. వీధి కుక్కలకు ఎలాంటి టీకాలు వేయరు. కాబట్టి వీధి కుక్కలు కరిస్తే రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

కుక్క కరిస్తే ఏం చేయాలి..?

కుక్క కరిస్తే రేబిస్ వ్యాధి సోకుతుందనే భయం చాలామందికి ఉంటుంది. అలాంటి భయాలను వదిలి కుక్క కరిచినప్పుడు మొదట గాయాన్ని కనీసం పది నిమిషాల పాటు శుభ్రంగా కడగాలి. తర్వాత బీటాడిన్ క్రీమ్ రాయాలి. అదే పెంపుడు కుక్క అయితే టీకాలు ఇస్తారు కాబట్టి రేబిస్ వచ్చే ప్రమాదం ఉండదు. అందుకే దాన్నొక మామూలు గాయంలా చూడాలి. ఒకవేళ వీధి కుక్క కరిస్తే వైద్యులను సంప్రదించాలి. కుక్క మరణించినట్లయితే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకోవాలి.ఈ ఇంజక్షన్.. కుక్క కరిచిన రోజుతో పాటు మూడో రోజు, ఏడో రోజు, పద్నాలుగో రోజు, 28వ రోజు.. ఇలా మొత్తం అయిదు ఇంజెక్షన్లు తీసుకోవాలి. యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ధర రూ. 300-400 ఉంటుంది. దీనికంటే ముందు ‘ఇమ్యునోగ్లోబులిన్’ అనే మరో ఇంజెక్షన్ కూడా ఇస్తారు. దీన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందజేస్తారు.

Tags

Related News

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Love Reddy Movie Review : లవ్ రెడ్డి మూవీ రివ్యూ…

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!

Big Stories

×