EPAPER
Kirrak Couples Episode 1

Corruption : లంచగొండి దగ్గర పింక్ బాటిల్స్ ఎందుకు..? ఆ సీక్రెట్ ఏంటో తెలుసా..!

Corruption : ‘మ‌న‌దేశంలో సైంటిస్టులు చేసే ప్ర‌యోగాలు వెలుగు చూడాలంటే లంఛం, మేధావుల మేధ‌స్సు మ‌న దేశానికి ఉప‌యోగప‌డాలంటే లంఛం.ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవాలంటే లంఛం.. ఠాగూర్ సినిమలో హీరో చిరజీవి చెప్పన డైలాగ్ ఇది.

Corruption : లంచగొండి దగ్గర పింక్ బాటిల్స్ ఎందుకు..? ఆ సీక్రెట్ ఏంటో తెలుసా..!

Corruption : మ‌న‌దేశంలో సైంటిస్టులు చేసే ప్ర‌యోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధ‌స్సు మ‌న దేశానికి ఉప‌యోగప‌డాలంటే లంఛం.ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవాలంటే లంచం.. ఠాగూర్ సినిమలో హీరో చిరజీవి చెప్పన డైలాగ్ ఇది. ప్రభుత్వ ఉద్యోగులు ఉందే మన కోసం పనిచేయడానికి కానీ కొంత మంది అక్రమార్కులు మాత్రం లంచం ఇస్తేనే పని చేయరు.


లంచం తీసుకోవడమే కాదు ఇవ్వడం నేరమే అని తెలిపిన్పటికీ.. ఈ లంచాలు తీసుకోవడం, ఇవ్వడం మారలేదు. అయితే ఇలాంటి లంచగొండుల ఆటకట్టించేదే అవినీతి నిరధక శాఖ (ACB). లంచం తీసుకునే వారిని ర్యెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే ఈ శాఖ పని. ఇక లంచంతో పట్టుబడారనే వార్త వినగానే టీవీల్లో, పత్రికల్లో లంచంగా తీసుకున్న బడ్డుతో పాటు పింక్ కలర్ నీటితో ఉన్న బాటిల్స్ కూడా దర్శనమిస్తాయి.

అయితే ఆ పింక్ కలర్ బాటిల్స్ ఏంటి? అవెందుకు అక్కడ ఉంచుతారో చూద్దాం..


ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేయాగానే.. సదరు వ్యక్తి ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారం ఇస్తాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సదరు వ్యక్తి లంచంగా ఇచ్చే డబ్బుపై ఫినాఫ్తలిన్ పౌడర్ చల్లుతారు. ఆ డబ్బులను లంచంగా ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగి ఆ నోట్లను లెక్కబెడితే ముందుగా చల్లిన ఫినాఫ్తలిన్ పౌడర్ ఉద్యోగి చేతులకు అంటుకుంటుంది. డబ్బు చేతుల మారగానే ఏసీబీ అధికారుల ఏంట్రీ ఇచ్చి.. ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకుంటారు.

అనంతరం ఫినాఫ్తలిన్ అంటుకున్న చేతులను సోడియం కార్బోనేట్‌లో కలిపిన నీటిలో ముంచిస్తారు. ఫినాఫ్తలిన్ పౌడర్ అంటుకుని ఉన్న చేతులు ఆ నీటిలో ముంచగానే పింక్ కలర్‌లోకి మారుతాయి. సోడియం కార్బోనేట్.. ఆల్కలైన్ ద్రావణం కావడంతో కలర్ పింక్‌గా తయారవుతుంది. ఈ పింక్ కలర్ వాటర్‌ను కోర్టులో సాక్ష్యంగా చూపి లంచం తీసుకున్న అధికారికి శిక్ష పడేలా చూస్తారు.

Tags

Related News

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Big Stories

×