china moon experiment : ప్రస్తుతం పలు పరిశోధనల్లో ఇతర దేశాల మాటల వినకూడదు, ప్రపంచ దేశాల సాయం తీసుకోకూడదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది చైనా. అన్నింటిలోనూ ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీపై ఆ దేశం కన్నుపడింది. ఇతర ప్రపంచ దేశాల కంటే ముందుగానే పలు అంతరిక్ష పరిశోధనలు చేయాలని చైనా అనుకుంటోంది. అందుకే చంద్రుడిపై మట్టి సేకరించడానికి చైనా సిద్ధమయ్యింది. దాంతో అనేక పరిశోధనలు చేయాలని సన్నాహాలు మొదలుపెట్టింది.
చంద్రుడిపై కట్టడాలు జరపాలి అనుకుంటున్న విషయాన్ని ఇప్పటికే చైనా బయటపెట్టింది. అందుకే చంద్రుడిపై ఆ దేశ ఆస్ట్రానాట్స్ ప్రత్యేక శ్రద్ధపెట్టారు. వచ్చే అయిదేళ్లలో అక్కడ ల్యూనార్ బేస్‌ను ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. త్వరలోనే దీనికి తగిన ప్రయత్నాలు మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉంది. ఈ విషయంపై చైనాకు చెందిన దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, స్పేస్ కాంట్రాక్టర్లు సమావేశం అయ్యి చర్చలు జరిపారు.
చైనా మీడియా తెలిపినదాని ప్రకారం ‘చైనీస్ సూపర్ మాసన్స్’ పేరుతో శాస్త్రవేత్తలు ఒక రోబోను తయారు చేయనున్నారు. ఇది చంద్రుడిపై దొరికిన మట్టిని ఉపయోగించి ఇటుకలను తయారు చేయనుంది. చంద్రుడిపై ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ చేయాల్సిన పరిశోధనలకు సాయంగా ఉంటుందని చైనా భావిస్తోంది. ఎన్నో ఏళ్ల వరకు వారు ఏ ఆటంకం లేకుండా వారు చంద్రుడిపై పరిశోధనలు చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు.
2028 చాంగ్ ఈ8 పేరుతో చైనా ఒక మిషిన్‌ను లాంచ్ చేయనుంది. అదే సమయంలో ల్యూనార్ మట్టితో ఇటుకను తయారు చేసే రోబోను కూడా లాంచ్ చేయాలని చైనా శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అయితే అప్పటిలోపు.. అంటే 2025లోనే చంద్రుడి లోపల భాగంలో ఉండే కొంత మట్టిని భూమిపైకి తీసుకురావాలని ఇతర ప్రపంచ దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. 2020లోనే చాంగ్ ఈ5 మిషిన్ ద్వారా చంద్రుడి పైన భాగంలో ఉండే కొంత మట్టిని చైనా సేకరించింది. ఇప్పుడు లోపల భాగంలోని మట్టి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ల్యూనార్ రీసెర్చ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత తమ ఆస్ట్రానాట్స్‌ను సంవత్సరాల తరబడి చంద్రుడిపైనే ఉంచి పరిశోధనలు చేయాలని చైనా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే చంద్రుడిపై చేయాలనుకుంటున్న పరిశోధనల గురించి, వాటి ప్లాన్స్ గురించి చైనాకు సంబంధించిన పెద్దలు కలిసి మరోసారి సమావేశం అవ్వనున్నారు. దీన్ని బట్టి చూస్తే చైనా పూర్తిగా చంద్రమండలంపై ఫోకస్ చేసిందని ఇతర ప్రపంచదేశాలు అనుకుంటున్నాయి.