Big Stories

China Corona : కరోనా కట్టడిలో చైనా ఫెయిల్ అయిందా..?

China Corona : కరోనాతో చైనా అట్టుడుకిపోతుంది. ఒక్కోరోజే 40వేలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కట్టడికి చైనాలోని పలు నగరాల్లో కఠిన లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. దీంతో కొవిడ్ నిర్భంధాలపై చైనా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంక్షలను ఎత్తివేయాలని, అధ్యక్ష పదవి నుంచి జిన్‌పింగ్ తప్పుకోవాలంటూ ప్రజలు గొంతెత్తుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కట్టడి అయిన కరోనా.. ఒక్క చైనాలోనే మళ్లీ ఎందుకు విజృంభిస్తుందనే డౌట్ అందరిలో కలగొచ్చు. దానికి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మొండిపట్టుదలే కారణం. అతని నిర్ణయాలు ఇప్పుడు చైనా ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది.

- Advertisement -

కరోనా వ్యాక్సిన్ విషయంలో చైనా సరైన నిర్ణయం తీసుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనాపై సమర్థంగా పనిచేసే పాశ్చాత్య టీకాలను అంగీకరించే విషయంలో జిన్‌పింగ్ మొండిగా వ్యవహరిస్తున్నారని నేషనల్ ఇంటెలిజెన్స్ అమెరికా డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై అంతగా ప్రభావం చూపని చైనా తయారీ వ్యాక్సిన్లపైనే జిన్‌పింగ్ ఆధారపడుతున్నారని అన్నారు.

- Advertisement -

చైనా ఇప్పటి వరకు విదేశీ టీకాలను ఆమోదించలేదు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న టీకాలను మాత్రమే ఉపయోగిస్తోంది. చైనా టీకాలు అంతగా పనిచేయడం లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయినా, మొండిగా వ్యవహరిస్తున్న చైనా.. విదేశీ టీకాలను అంగీకరించే విషయంలో వెనకడుగు వేస్తోంది. దీనికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది.

ప్రపంచదేశాలు దేశీయంగా ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌లతో పాటు అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న మెరుగైన కరోనా టీకాలను అనుమతిచ్చాియి. కరోనా వైరస్ నుంచి ఎక్కువ కాలం రక్షణ కల్పించే ఇమ్యూనిటీలో అందులో దొరుకుంది. కానీ చైనా మాత్రం విదేశీ వ్యాక్సిన్‌లకు అనుమతి ఇవ్వలేదు. కేవలం దేశీయంగా తయారైన టీకాలనే నమ్ముకుంది. కానీ వాటికి కరోనా నుంచి మనల్ని కాపాడే కాల వ్యవధి తక్కువ ఉండడంతో చైనాలో మళ్లీ కరోనా కోరలు చాచడానికి అవకాశం ఏర్పడింది

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News