EPAPER
Kirrak Couples Episode 1

Toxins : ఛీజ్, పాలలో హానికరమైన టాక్సిన్స్ గుర్తింపు..

Toxins : ఛీజ్, పాలలో హానికరమైన టాక్సిన్స్ గుర్తింపు..

Toxins : కొన్ని ఆహార పదార్థాల్లో ఉండే కొన్ని టాక్సిన్స్ అనేవి మనిషి శరీరానికి విషంగా మారుతాయి. అవి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే ప్రతీ ఆహార పదార్థాన్ని ప్రత్యేకంగా పరిశోధనలు చేసే మార్కెట్లోకి విడుదల చేస్తారు. అదే క్రమంలో ఒక దేశంలో మార్కెట్లో అమ్ముతున్న ఛీజ్, పెరుగు లాంటి వాటిలో మనిషుల శరీరాలపై తీవ్ర ప్రభావం చూపించే టాక్సిన్స్ ఉన్నాయని తెలుసుకొని శాస్త్రవేత్తలు షాక్ అవుతున్నారు.


ఛీజ్‌లో అఫ్లాటాక్సిన్స్ అనేవి ఉండడం అసలు మంచిది కాదు. అసలు ఛీజ్‌లో ఇవి కొంచెం కూడా ఉండకూడదు. ఒకవేళ అందులో అలాంటి టాక్సిన్స్ కొంత మోతాదులో ఉన్నా కూడా అది లివర్ డ్యామేజ్, క్యాన్సర్‌కు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ పాలు, ఛీజ్‌ను తయారు చేసే టెక్నాలజీ సైతం అఫ్లాటాక్సిన్స్ అనేవి పూర్తిగా ఉండవు అని గ్యారెంటీ ఇవ్వలేకపోతోంది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాల్లో ఈ విషయం నిరూపణ అయ్యింది.

బ్రెజిల్‌లోని ఒక ప్రాంతంలో ఛీజ్, పాలు గురించి కొన్ని శాంపుల్స్ తీసుకొని శాస్త్రవేత్తలు వాటిపై పరిశోధనలు చేపడుతున్నారు. అయితే ఈ ప్రతీ శాంపుల్‌లో అఫ్లాటాక్సిన్స్ అనేవి కనిపిస్తున్నాయని వారు బయటపెట్టారు. ముఖ్యంగా ఆర్టిసన్ మాజిరెల్లా ఛీజ్‌లో ఈ టాక్సిన్స్ శాతం ఎక్కువగా ఉందని తేల్చారు. ప్రతీ కిలో ఛీజ్‌లో 0.25 లో మైక్రోగ్రామ్స్ టాక్సిన్స్ ఉండడం అనేది సమస్యకు దారితీయదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యూరోప్‌లో ఆ శాతాన్ని డేంజర్‌గా పరిగణిస్తారు. కానీ బ్రెజిల్‌లో ఈ డేంజర్ శాతాన్ని మించి ఛీజ్, పాలు ఉపయోగిస్తున్నారని వారు గమనించారు.


బ్రెజిల్‌లో ఛీజ్‌లో కిలోలో 2.5 మైక్రోగ్రాముల అఫ్లాటాక్సిన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. మూడు దశాబ్దాల క్రితం ఈ పరిశోధనలు చేసుంటే ఇంత మోతాదులో అఫ్లాటాక్సిన్స్ అనేవి ఉండవని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. లిక్విడ్ క్రోమాటోగ్రాఫీ ద్వారా ఈ టాక్సిన్స్ గురించి వారు కనిపెట్టగలిగారు. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఛీజ్, పాలు లాంటి వాటి నుండి టాక్సిన్స్‌ను తొలగించే ప్రయత్నం చేయాలని శాస్త్రవేత్తలు విన్నవిస్తున్నారు.

Tags

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×