EPAPER

ChatGPT : అప్డేట్‌లో లేని చాట్‌జీపీటీ.. యూపీఎస్సీ ఎగ్జామ్ ఫెయిల్..

ChatGPT : అప్డేట్‌లో లేని చాట్‌జీపీటీ.. యూపీఎస్సీ ఎగ్జామ్ ఫెయిల్..

ChatGPT : మనిషి మేధస్సును మించి పనిచేయడానికి ఆ మనిషి తయారు చేసిన అస్త్రమే కృత్రిమ మేధస్సు. ఈ కృత్రిమ మేధస్సును శాస్త్రవేత్తలు కనిపెట్టినప్పటి నుండి ఎన్నో కొత్త కొత్త అద్భుతాలను మానవాలికి పరిచయం చేస్తోంది. మనిషి మేధస్సును మించే స్థాయికి ఎదిగింది. అయితే ఇది ఏమేరవరకు మనిషిలాగా ఆలోచించగలదు అనేదానిపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపడుతున్నారు. అలా వారు తాజాగా చేసిన ఒక టెస్టులో ఏఐ ఫెయిల్ అయ్యింది.


ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) మానవాలికి టెక్నాలజీని కొత్తగా పరిచయం చేస్తోంది. మనిషి మెదడులో ఉన్న ఆలోచనను బయటికి చెప్పకముందే ఏఐ అదేంటో కనిపెట్టేస్తోంది. అలాంటి ఏఐ సాయంతో తయారు చేసిన చాట్‌బోట్ చాట్‌జీపీటీ కూడా టెక్నాలజీ రంగంలో అద్బుతాలు సృష్టించడానికి సిద్ధమయ్యింది. కానీ తాజాగా ఈ చాట్‌జీపీటీ ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యింది. అదే యూనియన్ పబ్లిక్ కమిషన్ (యూపీఎస్సీ). ప్రపంచంలోనే కష్టమైన ఈ పరీక్షలో చాట్‌జీపీటీ కూడా ఫెయిల్ అయ్యింది.

యూపీఎస్సీ అనేది అంత సులువైన పరీక్ష కాదు. కొంతమంది ఈ ఎగ్జామ్‌ను క్రాక్ చేయడానికి ఎన్నో ఏళ్లపాటు కష్టపడతారు. తాజాగా చాట్‌జీపీటీ కూడా ఈ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. 2022 నవంబర్‌లో చాట్‌జీపీటీ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఒక్కసారిగా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. అమెరికాలో పెట్టిన ఎన్నో కష్టమైన పరీక్షలను చాట్‌జీపీటీ పాస్ అయ్యి చూపించింది. అంతే కాకుండా గూగుల్ కోడింగ్ ఇంటర్వ్యూలో కూడా క్రాక్ చేసింది.


ఇన్ని కష్టమైన పరీక్షలలో పాస్ అయిన చాట్‌జీపీటీ సామర్థ్యాన్ని మరింత తెలుసుకోవడానికి బెంగుళూరుకు చెందిన సంస్థ సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌ను పెట్టాలని నిర్ణయించుకుంది. జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, ఎకాలజీ, జెనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్.. ఈ టాపిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలతో ఎగ్జామ్ పేపర్‌ను సిద్ధం చేశారు. 100 ప్రశ్నలకు పేపర్ 1ను సిద్ధం చేయగా.. అందులో చాట్‌జీపీటీ కేవలం 54 ప్రశ్నలకు మాత్రమే సరిగ్గా సమాధానం అందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

2021 సెప్టెంబర్ కంటే ముందుగా జరిగిన సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ సరైన సమాధానాలు అందించింది. ఆ తర్వాత కాలానికి సంబంధించిన ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. అందుకే చాట్‌జీపీటీ కూడా అప్డేట్‌లో లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. అంతే కాకుండా కాలంతో సంబంధం లేని ఎకానమీ, జియోగ్రాఫీకి సంబంధించిన ప్రశ్నలకు కూడా చాట్‌జీపీటీ తప్పుడు సమాధానాలనే అందించడం గమనార్హం.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×