EPAPER

Ram Nagar Bunny: ‘రామ్ నగర్ బన్నీ’ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ అదుర్స్

Ram Nagar Bunny: ‘రామ్ నగర్ బన్నీ’ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ అదుర్స్

Ram Nagar Bunny Movie First Look, Glimpse Released: దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్న ‘రామ్ నగర్ బన్నీ’ సినిమాలో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్నారు. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్రు హీరోయిన్స్ గా నటుస్తున్నారు. వెల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ మహత్(వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ లో సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నది. అందులో భాగంగా నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం హీరో చంద్రహాస్ తన మంచితనాన్ని చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి తన వంతు ఆర్థిక సాయాన్ని చేశారు చంద్రహాస్.


ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ప్రభాకర్ నాకు తెలిసిన వ్యక్తి. ఇటు చంద్రహాస్ కూడా మా కూతురి క్లాస్ మేట్. ఈ సినిమా గురించి నాకు చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. ఈ ఈవెంట్ కు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ సినిమాతో హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ, చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. అతడిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాను. కుటుంబ సభ్యులు ఆయన ఎలా ఎదగాలని కోరుకుంటున్నారో ఆ స్థాయికి చంద్రహాస్ చేరుకోవాలని బెస్ట్ విశెష్ తెలియజేస్తున్నా’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read: బిగ్ టీవీలో ‘కిర్రాక్ కపుల్స్’ షో.. యాంకర్స్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?


అనంతరం చంద్రహాస్ మాట్లాడారు. ‘ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని అంతా కామెంట్ చేశారు. నేను సినిమాల్లో ఒకలా, బయట మరోలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా. అది కొందరికీ నచ్చలేదు. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. నేను ఇక్కడికి రావడానికి మా తల్లిదండ్రులు ఎంతగానో నాకు సపోర్ట్ చేశారు. మా డాడీ ప్రభాకర్ పేరు నిలబెట్టేలా నేను ఎంతైనా కష్టపడుతాను. నా ప్రతిభను నా సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం మూడు సినిమాల్లో నేను నటిస్తున్నాను. వాటిలో ఫస్ట్ మూవీగా ‘రామ్ నగర్ బన్నీ’ మీ ముందుకు రాబోతున్నది. వచ్చే నెల అక్టోబర్ లోనే మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాం. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంటది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. రామ్ నగర్ బన్నీ అనేది ఏ భాషలో సినిమా రిలీజ్ చేసినా కనెక్ట్ అయ్యే టైటిల్. ప్రజలను ఎంటర్ టైన్ చేయాలని ఎలా అనిపించిందో వాళ్లు వరద బాధల్లో ఉన్నప్పుడు కూడా నా వంతుగా సాయం చేసి వాళ్లకు సంతోషాన్ని పంచాలని అనిపించింది. అందుకే నా కొద్దిపాటి సంపాదనలో వీలైనంత తెలుగు రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం కూడా వరద బాధితుల సహాయార్థం అందిస్తాం’ అని పేర్కొన్నారు.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×