EPAPER

CARROT: చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగొచ్చా.. అతిగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు..!

CARROT: చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగొచ్చా.. అతిగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు..!

CARROT: చాలికాలంలో చాలా మంది జ్యూస్‌లు తాగడానికి ఇష్టపడరు. ఈ కాలంలో జ్యూస్ తాగితే జలుబు చేస్తుందని గట్టిగా నమ్ముతారు. ముఖ్యంగా క్యారెట్ జ్యూస్ తాగొచ్చా? లేదా? అనే సందిగ్ధంలో ఉంటారు. అయితే అలాంటి వారి అపోహలను ఆరోగ్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అంతేగాక మితంగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఎదురౌతాయని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.


ప్రయోజనాలు:

క్యారెట్‌లో విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల చలికాలంలో క్యారెట్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని అధిక ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.


విటమిన్ ఎ, సి కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యారెట్‌లోని విటమిన్ సి ఇమ్యునిటీని పెంచి సీజనల్ అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్ కణాలను ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడి చర్మ సౌందర్యాన్ని కలిగిస్తాయి. అలాగే క్యారెట్‌లోని పొటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

దుష్ప్రభావాలు:

క్యారెట్లు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల.. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇందులో ఉండే చక్కరలు, పీచు పదార్థాలు గ్యాస్‌నెస్ లేదా ఉబ్బరం లక్షణాలను కలిగిస్తాయి. మరికొంతమందికి కడుపు నొప్పి రావచ్చు. దీనికి ఓ కారణం ఉంది. పచ్చి క్యారెట్లు తిన్న తర్వాత కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. గ్యాస్, జీర్ణక్రియలో ఇబ్బంది లేదా ప్రకోప పేగు సిండ్రోమ్ అనే పరిస్థితి వల్ల అయినా అవుతుంది.

క్యారెట్‌లను ఎక్కువ కాలం పాటు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో బీటా-కెరోటిన్ స్థాయిలు పెరగడం వల్ల కెరోటినిమియా లేదా కెరోటినోసిస్ పరిస్థితి వస్తుంది. దీని ఫలితంగా.. చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ముఖ్యంగా అరచేతులు, అరి కాళ్లలో ఈ పరిస్థితి ప్రమాదకరంగా, అరుదుగా సంభవిస్తుంది.

Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×