EPAPER

Poonam Pandey NOT Dead: నేను చనిపోలేదు బతికే ఉన్నా.. దాని కోసమే అలా చేశా: పూనమ్ పాండే

Poonam Pandey NOT Dead: నేను చనిపోలేదు బతికే ఉన్నా.. దాని కోసమే అలా చేశా: పూనమ్ పాండే

Poonam Pandey NOT Dead: బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే (32) తాజాగా గర్భాశయ క్యాన్సర్‌తో తుది శ్వాస విడిచిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పూన‌మ్ టీమ్ వెల్లడించింది. ఈ వార్త తెలిసి బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. త‌ర‌చూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. రచ్చ రచ్చ చేసే పూనమ్ ఇక లేరని తెలిసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే పూనమ్ చనిపోయిందన్న వార్తలను మాత్రం ఆమె అభిమానులు నమ్మలేదు.


పూన‌మ్ మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచి ఆమె కుటుంబం స్పందించక‌పోవ‌డం, సోషల్ మీడియా ద్వారా కూడా ఒక్క పోస్టు కూడా పెట్టకపోవడంతో ఆమె చనిపోలేదని కొంతమంది చర్చించుకుంటున్నారు. మరికొంత మంది ఈ వార్తలు ఫేక్ కావచ్చు అని.. పూనమ్ ఇంతకు మునుపెన్నడూ ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు ఎక్కడా వెల్లడించలేదని అనుకుంటున్నారు.

ఈ మేరకు వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఒకరు ఇలా కామెంట్ చేశారు. గర్భాశయ పేషెంట్లు ఎప్పుడు కూడా అకస్మాత్తుగా చనిపోరు. నాలుగు రోజుల క్రితం వరకు ఆమె చాలా బాగానే ఉన్నారు. ఒకవేళ ఆమె నిజంగానే చనిపోయినట్లయితే ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేయాలి అంటూ పేర్కొన్నాడు.


అయితే ఈ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో తాజాగా పూనమ్ అసలు ట్విస్ట్ ఇచ్చింది. ఈ మేరకు తాను చనిపోలేదని.. ఇంకా బతికే ఉన్నానంటూ తెలిపింది. కేవలం మహిళలకు సర్త్వెకల్ క్యాన్సర్ అంటే ఏంటి? అనే అవగాహన కల్పించడం కోసం మాత్రమే తాను చనిపోయినట్లు ప్రకటించానని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను వదిలింది.

ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నాను. సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్ వల్ల నాకు ఏమి కాలేదు. ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలామంది మహిళలలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా.. గర్భాశయ క్యాన్సర్ ను పూర్తిగా నివారించవచ్చు. HPV వ్యాక్సిన్ అనేది ఈ జబ్బును గుర్తిస్తుంది. ఈ వ్యాధితో ఎవరూ చనిపోకుండా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పలువురు నెటిజన్లు ఆమెపై విరుచుకు పడుతున్నారు. గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కోసం ఇంతపెద్ద రచ్చ చేయడం అవసరమా? అంటూ మండిపడుతున్నారు. ఆలోచన మంచిదే అయినప్పటికీ.. చనిపోయినట్లు ఫేక్ వార్త స్ప్రెడ్ చేయడం సరైన పద్దతి కాదని కామెంట్లు చేస్తున్నారు. దీంతో వివాదాస్పద నటిగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు.

Related News

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

Big Stories

×