EPAPER

Black sugar cane for Sankranti:- సంక్రాంతికి నల్ల చెరకు సెంటిమెంట్

Black sugar cane for Sankranti:-  సంక్రాంతికి నల్ల చెరకు సెంటిమెంట్

Black sugar cane for Sankranti:-

సంక్రాంతి వేళ ఇంటి ముందు కార్యాలయాలు ముందు గుమ్మాలను పూలతో ముస్తాబు చేస్తారు. గుమ్మం బయట నల్ల చెరుకు గడలను కడతారు. పెద్ద పెద్ద వాహనాలకు పూలతో కలిపి చెరుకు గడలను కడుతుంటారు. పల్లెటూళ్లలలో అయితే ట్రాక్టర్లకు ఈ చెరుకు గడలను కట్టుకోవడం ఆచారంగా వస్తోంది. పచ్చగా ఉండే చెరుకు కాదని సంక్రాంతి వేళ కేవలం నల్లచెరుకునే వాడుతుంటారు. సంక్రాంతి పండుగలో ఈ నల్ల చెరకు ముక్కను నువ్వుల బెల్లంతో కలిపి ఇవ్వడం, ఈ పండగలో నల్ల చెరకు తినడం కూడా ప్రజలలో సంప్రదాయ ఆచారం.


నల్ల చెరకు లేకుండా సంక్రాంతి పూర్తి కాదు..శాస్త్రీయ కారణం కూడా ఉంది..నూతన సంవత్సరంలో మొదటి పండగైన సంక్రాంతి నాడు నువ్వులు పంచుకుని మంచిగా మాట్లాడాలని అంటారు. కాబట్టి నల్ల చెరకుకు విపరీతమైన డిమాండ్ ఉంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో లక్షల హెక్టార్లలో తెల్ల చెరకు సాగవుతున్నప్పటికీ నల్ల చెరుకు పెద్దగా కనిపించదు. రైతులు కూడా నల్లచెరుకు సాగును చేయరు. కర్ణాటకలోనే ఈ నల్లచెరకును పండిస్తుంటారు. ఆంధ్ర, తెలంగాణతో పోల్చితే కర్ణాటకలో ఈ పంట కనిపిస్తుంది. చన్నపట్నంలోని 2-3 గ్రామాలు మాత్రమే నల్ల చెరకును పండిస్తుంటాయి.

సంక్రాంతి రోజున గుమ్మడి కాయ ముక్కలు వేసిన పులుసు, మినప గారెలు, నువ్వుల పొడి, చెరకు ముక్క తప్పని సరిగా తినాలని శాస్త్రం చెప్పింది. ఔషధ గుణాలు కలిగిన పదార్ధాల కాబట్టి వీటిని తినాలంటారు. . ఇందులో ఒక్క గుమ్మడికాయను మినహాయిస్తే మిగిలినవి మన దేహాన్ని వెచ్చబరచి జనవరిలోని చలి నుంచి మనలను రక్షించే పదార్థాలు. ఇక గుమ్మడి కాయ స్త్రీ-పురుషుల్లోని వంధ్యత్వాన్ని నివారించి గర్భాశయ దోషాలను, వీర్య దోషాలను నివారించే గొప్ప ఔషధం. సంతాన సమస్యలకి గుమ్మడికాయను మించిన మంచి మందు మరోటి లేదని పెద్దలు చెబుతారు.


Follow this link for more updates:- Bigtv

Related News

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Big Stories

×