Bitcoin and Cryptocurrency : లాస్ట్ ఇయర్ బిట్ కాయిన్ చుక్కలు చూపించింది. దాదాపు అన్ని క్రిప్టోకరెన్సీలూ ఇలాగే మైండ్ బ్లాంక్ చేశాయి. ఇండియన్స్ అయితే ఆల్‌మోస్ట్ క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరిచిపోయారు కూడా. అలాంటిది సడెన్‌గా ఓ పాజిటివ్ న్యూస్. బిట్ కాయిన్ 30 వేల డాలర్ల మార్క్ దాటి 10 నెలల గరిష్ట స్థాయికి రీచ్ అయిందని. ఒక్క బిట్ కాయిన్ మాత్రమే కాదు.. మిగతా క్రిస్టో కరెన్సీల్లోనూ ఓ ఊపు కనిపిస్తోంది. జనరల్‌గా క్రిప్టో మార్కెట్టే అలా ఉంటుంది. ఒకసారి మూమెంట్ వస్తే దాదాపు అన్ని క్రిప్టోల్లోనూ కదలిక వస్తుంది. పెరిగితే అన్నీ పెరుగుతాయి, పడితే అన్ని ముంచేస్తాయి. అలా ఉంటుంది.
రష్యా- ఉక్రెయిన్ వార్ మొదలై వరల్డ్ స్టాక్ మార్కెట్స్ పడిపోయినప్పుడు క్రిప్టోలన్నీ భారీగా పడిపోయాయి. ఆ దెబ్బకు బిట్ కాయిన్ కూడా 16వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. 60వేల డాలర్ల నుంచి 16వేలకు పడిపోవడం.. నిజంగా అతిపెద్ద పతనమే. ఈమధ్యే బిట్ కాయిన్ కాస్త పుంజుకుంటోంది. అమెరికాలో ఇన్‌ఫ్లేషన్ పెరగడం దాదాపు ఆగిపోయినట్టే. సో, యూఎస్ ఫెడ్ ఇక వడ్డీరేట్లు పెంచకపోవచ్చు. పైగా బ్యాంకింగ్ సెక్టార్ దివాళ తీస్తుందేమోనన్న భయాలు ఉన్నాయ్. సో, ఈ సమయంలో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా క్రిప్టో కరెన్సీస్ కనిపిస్తున్నాయి. అటు ఇథిరియం కూడా 1925 డాలర్లకు పెరిగింది. డోజ్ కాయిన్, సొలానా, షిబా వాల్యూస్‌లో కూడా మూమెంటమ్ కనిపిస్తోంది.
అయితే క్రిప్టో కరెన్సీల్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా. మూమెంటమ్ వచ్చింది కాబట్టి రిటర్న్స్ వస్తాయా? ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం.. ఇప్పటికిప్పుడు క్రిప్టోల్లో పెట్టుబడి పెట్టకపోవడమే బెటర్. అందులోనూ ఇండియన్స్ పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది. క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్లపై కేంద్ర ప్రభుత్వం టీడీఎస్ పెట్టింది. పైగా ట్యాక్స్ కటింగ్ కూడా. సో, వచ్చే లాభం ఏమోగానీ.. నష్టం వస్తే మాత్రం కోలుకోలేకపోవచ్చు. అందుకే, ఇంకొంత కాలం క్రిప్టోలకు దూరంగా ఉంటేనే బెటర్ అని సలహా ఇస్తున్నారు.