EPAPER

Bathing Soaps : మీ చర్మానికి ఏ సబ్బు వాడుతున్నారు.. ఒక్కసారి చెక్ చేసుకోండి..!

Bathing Soaps : మీ చర్మానికి ఏ సబ్బు వాడుతున్నారు.. ఒక్కసారి చెక్ చేసుకోండి..!

Bathing Soaps : మనం బాగా అలసిపోయినప్పుడు స్నానం చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది. అప్పటి వరకు ఉన్న అలసట అంతా దూరమైన ఫీలింగ్ వస్తుంది. మంచి సోప్‌తో స్నానం చేస్తే ఒంటిపై మురికంతా దూరమై ప్రశాంతగా ఉంటారు. అయితే స్నానికి వాడే సబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సబ్బు క్లీనింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. వీటిని జంతువుల, కూరగాయల కొవ్వుతో తయారు చేస్తారు.


సబ్బుకు చర్మం pH స్థాయిలను ప్రభావితం చేసే గుణం ఉంటుంది. చర్మ pH స్థాయిలో మార్పులు వస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మన మార్కెట్లో దొరికే సబ్బుల్లో 9 నుంచి 11 మధ్య pH లెవల్ ఉంటుంది. ఈ pH స్థాయి వల్ల చర్మ సమస్యలు వస్తాయి.

సబ్బును నేరుగా చర్మానికి అప్లై చేయకూడదు. అది నీటిలో కలిపి.. ఆ నురగతో చర్మం శభ్రం చేసుకోవాలి. చెమట దురద ఉన్న ప్రాంతాలో జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. సబ్బును నేరుగా ముఖానికి రాయకూడదు. అలా చేస్తే చర్మం పొడిబారుతుంది. కొన్ని సందర్భాల్లో అలర్జీలు కూడా రావచ్చు. మనకు మార్కెట్లో బార్ సోప్స్, పవర్ జెల్ సోప్స్, హెర్బల్ సోప్స్, యాంటీ బాక్టీరియల్ సోప్స్, అరోమాథెరపి సోప్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి.


పొడిచర్మం : మీ చర్మం పొడిగా ఉంటే.. కోకో బటర్, కలబంద, అవకాడో, కూరగాయల నూనెలతో తయారు చేసిన సబ్బులు వాడండి.

జిడ్డుచర్మం : మీ చర్మం జిడ్డుగా ఉంటే.. క్లెన్సర్ సోప్, యాంటీ బాక్టీరియాల్, లావెండ్, థైమ్ సోప్స్, చమోమిలే సోప్స్ వాడితే మంచిది.

సెన్సిటివ్ చర్మం : మీ చర్మం సెన్సిటివ్‌గా ఉంటే.. విటమిన్ ఇ, జోజోబా ఆయిల్, ఇచ్థియోసిస్, ఎగ్జామియా, హెర్బల్ సోప్స్ వాడాలి.

అరోమా థెరపీ సబ్బులు : ఈ సబ్బు తయారీలో ఎసెన్షియల్ ఆయిల్ వాడతారు. చామోమిలే, జాస్మిన్, య్లాంగ్ వంటి నూనెలు కలిపి వీటిని తయారు చేస్తారు.

హెర్బల్ సబ్బులు : ఈ సబ్బులను సహజ సిద్దంగా దొరికే పదార్థాలతో తయారు చేస్తారు. ఆలివ్ ఆయిల్, షియా బటర్, అవకాడో, పుదీనా, వోట్మీల్, చమోమిలే, లావెండర్ వాటిని ఉపయోగించి తయారు చేస్తారు. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని రిపేర్ చేసి ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

యాంటీ బాక్టీరియల్ సబ్బులు : ఈ సబ్బులలో ట్రైక్లోకార్బన్, టైక్లోసన్ వంటి యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లను కలుపుతారు. ఈ సోప్స్‌లో pH 9 నుంచి 10 వరకు ఉంటుంది. ఇవి చర్మంపై ఉండే సూక్ష్మజీవులు, హానికరమైన క్రిములతో పోరాడతాయి. చాలా మంది యాంటీ బాక్టీరియల్ సోప్స్ వాడితే మంచిదని అనుకుంటారు. ఈ సబ్బులు ఎక్కువ వాడితే చర్మం పొడిబారుతుంది. ఇవి చర్మానికి మంచి చేసే బాక్టీరియాను చంపేస్తాయి.

యాంటీ యాక్నే సబ్బులు : ముఖం, ఛాతి, వీపుపై మొటిమలు ఎక్కువుగా ఉంటే ఈ సబ్బులను వాడతారు. యాంటీ బాక్టీరియల్, ఎక్స్‌ఫోలియేంట్, కామెడోలిటిక్ లక్షణాలు ఉన్న సబ్బులు మార్కెట్లో చాలా దొరుకుతాయి. వీటిని రోజుకు రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి.

మీ చర్మం చెప్పేది వినండి. సరైన సబ్బు మీ చర్మాన్ని శుభ్రంగా, రీఫ్రెష్‌గా ఉంచుతుంది. మెరుగైన సిఫార్సు కోసం వైద్యులను సంప్రదించండి.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×