EPAPER

Average Student Nani: ‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి’

Average Student Nani: ‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి’

Average Student Nani: ఆగస్టు 2న విడుదల కాబోతున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. మోస్ట్ రొమాంటిక్‌గా సాగుతూ ఈ టీజర్ యూత్‌ను ఎంతగానో కట్టిపడేస్తున్నది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లోకి రానున్న ఈ సినిమాలో యువ హీరోగా పవన్ కుమార్ ఎంట్రీ ఇస్తున్నారు. మెరిసే మెరిసే చిత్రంతో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఈ యువ హీరో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం విడదల కోసం ప్రేక్షకులు తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


టీజర్ విషయానికి వస్తే.. డైలాగ్స్‌తో అదరగొట్టేశాడు హీరో. ‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్ ట్రార్డినరీగా ఉండాలి.. కాలేజీలో ఉన్నంతవరకే నాని, ఆ తరువాత కూకట్‌పల్లి నాని అంటూ ఎనర్జిటిక్‌గా డైలాగులు చెబుతూ తెగ అలరించేశాడు పవన్. పిచ్చెక్కించే రొమాన్స్ ఒక్కటే కాదు.. కామెడీ, యాక్షన్ కూడా ఈ సినిమాలో ఉన్నట్లు టీజర్‌తో తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా టీజర్‌లోని విజువల్స్, ఆర్ఆర్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Also Read: క్షమించండి.. ‘యానిమల్‌’లో ఆ సీన్ చేసినందుకు.. : రణబీర్ కపూర్


అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ఊపకందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై హైప్‌ను పెంచాయి. స్నేమల్వి, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, సాహిబా భాసిన్‌తో పాటువురు కీలక నటీనటులు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సజీష్ రాజేంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందించగా, ఉద్ధవ్ ఎస్బీ ఎడిటర్‌గా పనిచేశారు.

Related News

Vande Bharat Express: వందేభారత్ రైలు వివాదం.. ఉద్యోగుల మధ్య ఘర్షణ

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Big Stories

×