EPAPER

Asafoetida : ఇంగువ‌తో గ్యాస్‌ మటుమాయం

Asafoetida : ఇంగువ‌తో గ్యాస్‌ మటుమాయం

Asafoetida : ఇంగువ‌.. దీన్ని భార‌తీయులు పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. అనేక వంట‌ల్లో ఇంగువ వేసుకుంటారు. దీంతో వంట‌కాల‌కు మంచి రుచి, వాస‌న కూడా వ‌స్తాయి. ఇంగువ వేసి వండిన ప‌దార్థాల‌ను ఎక్కువ మంది ఎంతో ఇష్టంగా తింటారు.



అయితే ఇంగువతో మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్రయోజ‌నాలు కూడా ఉన్నాయి. ఇంగువ‌ను ఆహారాల్లో తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, పేగుల్లోని పురుగులు, ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్‌, అజీర్ణం, క‌డుపునొప్పి, క‌డుపు ఉబ్బరంగా ఉండ‌టం, మ‌ల‌బ‌ద్దకం, డ‌యేరియా, అల్సర్లు పోతాయి. ఇంగువ‌లో యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో శ్వాస‌కోశ స‌మ‌స్యల నుంచి బయటపడవచ్చు. శ‌రీరంలో ఎక్కువగా ఉండే మ్యూక‌స్ కూడా క‌రుగుతుంది. అంతేకాకుండా బాక్టీరియా, సూక్ష్మక్రిములు న‌శిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా బాగా పెరుగుతుంది. బ్రాంకైటిస్‌, ఆస్తమా, కోరింత ద‌గ్గులాంటి స‌మ‌స్యలకు ఇంగువ ఎంతో మేలు చేస్తుంది.

ఇంగువ‌ తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌కు అనారోగ్య స‌మ‌స్యలు దరిచేరవు. రుతు స‌మ‌యంలో అధికంగా ర‌క్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే సంతాన లోపం, ముందుగానే ప్రస‌వ నొప్పులు రావ‌డంలాంటి స‌మ‌స్యలు ఉండ‌వు. దంతాలు, చెవుల నొప్పికి ఇంగువ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఇంగువ‌ క‌లిపి నోట్లో పోసుకుని బాగా పుక్కిలిస్తే దంతాల నొప్పి కూడా త‌గ్గుతుంది. అలాగే కొబ్బరినూనె, ఇంగువ‌ క‌లిపి రెండు చుక్కలు చెవుల్లో వేస్తే చెవి నొప్పి త‌గ్గుతుంది. ఈ ఇంగువ‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×