EPAPER

14 Worlds : 14 లోకాలు ఏవి.. ఏయే లోకంలో ఎవరెవరు ఉంటారు ?

14 Worlds : 14 లోకాలు ఏవి.. ఏయే లోకంలో ఎవరెవరు ఉంటారు ?

14 Worlds as per Hindu Mythology : హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్‌పురుషుని (విశ్వరూపుని) శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం రెండవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం 14 లోకాలనీ, వాటిలో ఊర్ధ్వలోకాలు అనగా భూమి నుండి పైనున్నవి 7, అధోలోకాలు అనగా భూమి నుండి క్రిందనున్నవి 7.


ముందుగా ఊర్ధ్వ లోకాలు చూద్దాం అవి 7.
1) భూలోకం – ఇచ్చట స్వేదం అనగా చెమట నుండి ఉద్భవించు పేళ్ళు లేదా పేనులు,నల్లులు మొదలైనవి. ఉద్భిజాలు అనగా గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు, అలాగే జరాయుజాలు స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు, పశువులు. నీటిలో నివసించే జలచరాలు మొదలైనవి ఉంటాయి.

2) భువర్లోకము భూలోకము పైన ఉంటుంది. ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు.


3) సువర్లోకము లేక స్వర్గలోకము.. ఇది భువర్లోకము పైన ఉంటుంది. ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు ఉంటారు.
వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వృద్ధాప్యం, శరీర దుర్గందాధులుండవు.
వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున మాతృగర్భవాసం ఉండదు.

4) మహర్లోకము.. ఇది సువర్లోకము పైన ఉంటుంది, ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.

5) జనోలోకము.. ఇది మహర్లోకము పైన ఉంటుంది, దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో.. ఆమె పవిత్ర శీల ప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువురూ.. ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.

6) తపోలోకము. ఇది జనోలోకము పైన ఉంటుంది. ఇది సనత్, సనక్, సనందన్, సనాతన్ అనే నలుగురు కుమారుల నివాసం.వీళ్లు విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారాలు, వీరు అమరత్వం కలిగి 5 సంవత్సరాల చిన్న పిల్లల రూపంలో ఉంటారు. వారు బ్రహ్మ లోకానికి మిగతా లోకాలకు సులభంగా వెళ్లి వస్తారు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి.

కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతామూర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడ జన్మరాహిత్యం పొందుతారు.

7) సత్యలోకం .. ఇది తపోలోకము పైన ఉంటుంది. ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు. బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పాలనంతరం ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరింది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి.ఈ లోకంలో కూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు,
భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావిస్తుంటారు.

ఇప్పుడు భూలోకానికి కింద ఉండే అధోలోకాల గురించి తెలుసుకుందాం.. అవి 7.

1) అతల లోకం.. ఇది భూలోకానికి క్రింద ఉంటుంది. మయుడి కుమారుడైన బలుడి వినోద స్థానం. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులుగా ఉంటారు.

2) వితల లోకం.. ఇది అతల లోకం క్రింద ఉంటుంది, ఇక్కడ హాఠకేశ్వరుడు అనగా శివుడు భవానీ అమ్మవారితో వినోదిస్తుంటాడు. హాఠకి నదీ జలాలతో తయారైన సువర్ణంతో అసుర స్త్రీలు అలంకరించు కుంటుంటారు.

3) సుతల లోకము.. ఇది వితల లోకం క్రింద ఉంటుంది. సప్త చిరంజీవులలో ఒకరైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. బలి చక్రవర్తి స్వర్గంలో ఉండే ఇంద్రుడు అనుభవించే భోగాలకన్నా ఎక్కువ భోగాలను అనుభవిస్తూ వైభవంగా పాలిస్తుంటాడు.

4) తలాతల లోకం.. ఇది సుతల లోకం క్రింద ఉంటుంది, ఇక్కడు యక్షులు ఉంటారు. అలకా నగర పరిపాలకుడు కుబేరుడు యక్షులకు రాజు.. వీరు అన్ని లోకాలలో ఉన్న గుప్తనిధులను రక్షిస్తుంటారు.

5) మహాతల లోకం .. ఇది తలాతల లోకము క్రింద ఉంటుంది. ఇక్కడ క్రదుపుత్రులైన వినత క్రదువలు, కాద్రవేయులు అను సర్పాలు, సహస్రాది శిరస్సులతో కూడినవారై మహా బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.

6) రసాతల లోకం .. ఇది మహాతల లోకం క్రింద ఉంటుంది, ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు. ఇక్కడ మయుడు రాక్షసులుండే పట్టణాలను నిర్మిస్తుంటాడు. దానవ దైత్యులు, నివాతకవచులు, కాలకీయులు ఉంటారు.వీరంతా మహా సాహసవంతులు.

7) పాతాళ లోకం.. ఇది రసాతల లోకం క్రింద ఉంటుంది. ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు శంఖుడు, కులికుడు, ధనుంజయుడులాంటి మహా నాగులన్నీ గొప్ప గొప్ప మణులతో ప్రకాశిస్తుంటాయి. ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది. ముప్పై వేల యోజనాల కైవారంలో చుట్టచుట్టుకుని ఉంటాడు.ఆదిశేషుడి పడగ మీద ఈ భూమండలం అంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. ప్రళయకాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు.

ఈ 7 అథోలోకాలు ఒక్కోక్కటి పదివేల యోజనాల వెడల్పు, అంతే లోతు కలిగి ఉంటాయి. వీటిని బిల స్వర్గాలు అని కూడా అంటారు. ఈ లోకాల్లో కూడా కామ, భోగ, ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్టే ఇక్కడి వారికి లభిస్తుంటాయి.

ఈ లోకాలన్నిటినీ మయుడు నిర్మించాడు. అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకవాసుల పని. ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడి వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు. అయితే సర్పాల మణులు దేదీప్యంగా కాంతులీనుతూ ఈ లోకాలలో వెలుగును ప్రసరింప చేస్తుంటాయి. ఇక్కడి వారంతా వ్యాధులకూ, వార్ధక్యానికీ, మానసిక బాధలకూ దూరంగా ఉంటారు.

సో.. ఇది 14 లోకాల గురించిన సమగ్ర సమాచారం.

Tags

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×