Big Stories

Artificial intelligence : తుఫాను హెచ్చరికలు జారీ చేసే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్..

Artificial intelligence : తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు. వచ్చినప్పుడు ఎంతో నష్టాన్ని మిగిల్చి వెళ్తాయి. ఇప్పటికే పెరిగిన టెక్నాలజీ సాయంతో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగా కనిపెట్టడానికి ఎన్నో పద్ధతులు ఆచరణలోకి వచ్చాయి. అయినా కూడా అలాంటి సమయాల్లో ప్రాణనష్టం తప్పడం లేదు. అందుకే అమెరికాలోని డెలావెర్ అనే రాష్ట్రం దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయం తీసుకోనుంది. దీంతో ప్రజలను హెచ్చరించాలని అనుకుంటోంది.

- Advertisement -

అమెరికాలోని డెలావెర్ అనే రాష్ట్రంలో ఎన్నో బీచ్‌లు ఉన్నాయి. వాటన్నింటి వెళ్లే మార్గాలు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. అందుకే తుఫాను లాంటివి వచ్చే అవకాశం ఉన్నప్పుడు, లేదా అనుకోకుండా వచ్చినప్పుడు ఆ బీచ్‌లను ఒక్కసారిగా ఖాళీ చేయడం చాలా కష్టంగా మారుతుంది. అయితే వారిని ఖాళీ చేయించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయం తీసుకోవడం మేలు అని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీని సాయంతో అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేస్తే ప్రకతి విపత్తులు సమయంలో ఉపయోగపడతాయని అనుకుంటున్నారు.

- Advertisement -

ఇప్పటికే అమెరికా ప్రభుత్వం తరపున డెలావెర్‌కు ఆర్థిక సాయం కూడా అందింది. టూరిజం సీజన్ సమయంలో అయితే ఇక్కడ బీచ్‌లకు వచ్చే జనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడు చూసినా జనాలు కనిపిస్తారని అక్కడివారు చెప్తున్నారు. అందుకే తుఫాను వంటి సమయాల్లో రోడ్ల నిండా నీళ్లు నిలిచిపోయే కారణంగా వచ్చిన మనుషులు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఇరుక్కుపోతారని చెప్తున్నారు. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కావడంతో అమెరికా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతంపై దృష్టిపెట్టింది.

అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తయారు చేసిన సెన్సార్లను డెలావెర్‌లోని ప్రతీ బీచ్‌లో పెట్టనున్నారు. ఈ సెన్సార్లు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి చుట్టు పక్కన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సెల్‌ఫోన్ ద్వారా అలర్ట్‌ను పంపిస్తాయని అన్నారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఆ ప్రాంతాన్ని ముందస్తుగానే ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. డెలావెర్ చేసిన ఈ ఆలోచనను చూసి చాలా టూరిస్ట్ ప్రాంతాలు ఈ సెన్సార్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News