Big Stories

Pushkar : పుష్కర్ క్షేత్ర సందర్శనకు నియమాలు ఉన్నాయా….

Pushkar : పుష్కరుడికి బ్రహ్మదేవుడి, గురుడికి సంబంధం ఉంది. గ్రహాల్లో గురు గ్రహం పెద్దది .బ్రహ్మదేవుని ఆలయానికి పుష్కరానికి కూడా ఒక లింకు ఉంది. అవన్నీ నిజమని మార్కేండేయ పురాణం చెబుతోంది. ఆకాశంలో నక్షత్రాల కదలికలు బట్టి ఈకథలు ఏర్పడ్డాయి. ఒక సారి బ్రహ్మదేవుడి ఆకాశమార్గంలో వెళ్తుండగా ఆయన చేతిలో కమండలం జారి భూమి మీద పడింది. అది రాజస్థాన్ లోని ఆజ్మీర్ కి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. అదే పుష్కర్ క్షేత్రం.

- Advertisement -

పద్మ అక్కడ పడటంతో దివ్యమైన సరోవరం ఏర్పడింది . అదే పద్మ క్షేత్రంగా.. పుష్కర్ క్షేత్రంగా విరాజిల్లుతోంది. తుందురుడు అనే గంధర్వుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఈశ్వర అనుగ్రహం సంపాదించాడు. ఈశ్వరుడి 8 రూపాలల్లో జల రూపంలో పొందాలని వరం అడిగాడు. గాలి,తేజస్సు, ఆకాశం అన్నీ కలసినప్పుడు ఏర్పడేది పుష్కర స్వరూపం. ప్రతి పౌర్ణమి అమావాస్యల రోజుల్లో ప్రత్యేక పూజలుంటాయి. కార్తీకంలోనే పుష్కరజాతర మహా వైభవంగా జరుగుతుంది. ఇది దీపావళి తర్వాత వచ్చే ఏకాదశి నాడు ప్రారంభమై, పౌర్ణమి వరకు జరుగుతుంది

- Advertisement -

పుష్కర్ సరస్సులో 52 ఘాట్ లున్నాయి. నిత్యంహోమాలు, పూజలతో కళకళ లాడుతూ కనిపిస్తుంది. ఈక్షేత్రాన్ని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మ విగ్రహరూపంలో పూజలు అందుకునే ఏకైక దేవస్థానం ఇది.ఆరావళి పర్వతాల మధ్య మహాక్షేత్రంగా విరాజిల్లుతోంది. గర్భగుడిలో బ్రహ్మదేవుని దర్శనం చేసిన వారికి ఆలయంలో బ్రహ్మవాహనం హంస వాహనం కూడా దర్శనమిస్తుంది. పుష్కర్ లో ఏటా జరిగే ఒంటెల జాతర చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. రాజస్థాన్ లోని సుందరమైన ప్రదేశాల్లో పుష్కర్ ఒకటి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News