EPAPER

Eclipse : నవంబర్ 8న మరో గ్రహణం

Eclipse : నవంబర్ 8న మరో గ్రహణం

Eclipse : కార్తీకమాసంలో పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. పౌర్ణమి రోజు అనేక వ్రతాలు ఆచరిస్తుంటారు. అలాంటి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. కార్తీకమాసంలో భక్తులు ఎంతో కీలకంగా భావించే రెండు రోజులు జ్వాలా తోరణం, పౌర్ణమి. అలాంటి ఈ రెండు వేడుకలకు ఈ సారి గ్రహణం అడ్డంగా మారింది. చంద్రగ్రహణం వల్ల కార్తీక పౌర్ణమిరోజు పూజలు చేసుకునే పరిస్థితి ఉండదని పండితులు చెబుతున్నారు.


చంద్రగ్రహణం నవంబర్ 8న మనదేశంలో కోల్‌కతా, సిలిగురి, గౌహతి మొదలైన ప్రదేశాలలో సంపూర్ణంగా కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో చివరి గ్రహణం నవంబర్ 8, 2022, కార్తీక పూర్ణిమ నాడు రాబోతోంది. 2022 అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజులలోపు ఈ రెండో గ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం ప్రజల మనసుల్లో ఆందోళనను పెంచుతోంది.

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, రెండు గ్రహణాలు ఒకే వైపు లేదా 15 రోజులలోపు కొన్ని పెద్ద అశుభాలకు సంకేతం. దీన్నిబట్టి చూస్తే ఇప్పుడు దేశం, సమాజం ఏదో ఒక పెద్ద కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం లేదా చంద్ర గ్రహణం అయినా అన్ని రాశుల మీద కూడా గ్రహణ ప్రభావం కనిపిస్తుంది. గ్రహణం తర్వాత ఒక నెల వరకు కాలం చాలా ముఖ్యమైనది.


నవంబర్ 8, 2022న వచ్చే ఏడాది చివరి గ్రహణం, నాలుగు రాశులకు లాభాన్నిస్తుంది. ఇందులో భాగంగా మిథునం, జెమిని, కర్కాటకం, వృశ్చికం, కుంభరాశికి ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో, మేషం, వృషభం, కన్య, మకర రాశులకు నష్టాలు తప్పవు. మిగిలిన నాలుగు రాశుల వారు గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు పొందుతారు.

చంద్రగ్రహణం నవంబర్ 8, 2022
గ్రహణం ప్రారంభం- సాయంత్రం 5:32 గంటలకు
ముగిసే సమయం- సాయంత్రం 06.18 గంటలకు
సూతక కాలం ప్రారంభం- ఉదయం 09:21
సూతక కాలం ముగిసే సమయం- సాయంత్రం 06.18

ఈ ఏడాది ఇప్పటి మొత్తం నాలుగు ఏర్పడ్డాయి. అందులోచివరిదే నవంబరు 8, మంగళవారం ఏర్పడుతున్న చంద్రగ్రహణం. అయితే ఈ గ్రహణాలు గురించి భయపడాల్సిన పనిలేదని జనవిజ్ఞానవేదికలు చెబుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలో వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడటం సర్వసాధారణమన్న సంగతి గుర్తించుకోవాలని సూచిస్తున్నారు.

Related News

Navratri 2024: నవరాత్రుల్లో 9 రోజులు ఇలా చేస్తే భవాని మాత అన్ని సమస్యలను తొలగిస్తుంది

Pitru Paksha 2024: పితృపక్షంలో ఈ పరిహారాలు చేస్తే మీ పూర్వికులు సంతోషిస్తారు.

Trigrahi yog September 2024 Rashifal: ఒక్క వారంలో ఈ 6 రాశుల జీవితాలు మారబోతున్నాయి..

Auspicious Dream: కలలో ఈ పువ్వు కనపిస్తే ధనవంతులు అవవుతారట.. మీకు కనిపించిందా మరి

Sun Transit 2024: సూర్యుడి సంచారం.. వీరికి ఆకస్మిక ధనలాభం

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంత ప్రత్యేకం? 70 ఏళ్ల కిందట.. ఒక్క ‘అడుగు’తో మొదలైన సాంప్రదాయం

Sun Transit 2024: సూర్యుని సంచారంతో ఈ నెలలో ఏ రాశి వారికి లాభమో, ఎవరికి నష్టమో తెలుసా ?

Big Stories

×