Big Stories

Animal vaccine : యానిమల్ వ్యాక్సిన్ తయారీ.. వారి సహకారంతోనే..

Animal vaccine : ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా, అభివద్ధి చెందిన సంస్థ అయినా కలిసి పనిచేస్తేనే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. దీనిని నిరూపించడానికి వారి దగ్గర ఉదాహరణలు కూడా ఉన్నాయి. అలా కలిసి పనిచేయడం ద్వారానే ఎన్నో సంస్థలు ఎన్నో సాధించాయని వారు అంటున్నారు. తాజాగా అలా చేయడం ద్వారానే యానిమల్ వ్యాక్సిన్ కనుక్కున్నాయి రెండు పెద్ద విశ్వవిద్యాలయాలు.

- Advertisement -

కోవిడ్ వల్ల వ్యాక్సిన్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. ఇది ఒక వైరస్‌ను మన శరీరంలోకి రానివ్వకుండా చేస్తుంది. మనుషులకు ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండడానికి వ్యాక్సిన్ అనేది ఎంత ముఖ్యమో.. జంతువులకు కూడా అంతే ముఖ్యం. అందుకే అయోవా స్టేట్ యూనివర్సిటీ, నానోవ్యాక్సిన్ ఇన్‌స్టిట్యూట్ కలిసి నానోపార్టికల్స్‌ను ఉపయోగించి కమర్షియల్ యానిమల్ వ్యాక్సిన్‌ను తయారుచేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం వారు మెర్క్ యానిమల్ హెల్త్‌తో చేతులు కలిపారు.

- Advertisement -

2022 ఫిబ్రవరిలోనే ఈ యానిమల్ వ్యాక్సిన్ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది. సంవత్సరం పాటు కష్టపడిన తర్వాత యానిమల్ వ్యాక్సిన్ యానిమల్ హెల్త్‌కు ఉపయోగపడే విధంగా బయటికొచ్చింది. అంతే కాకుండా ఈ యానిమల్ వ్యాక్సిన్ ద్వారా ఎన్నో ఎకానమిక్ లాభాలు కూడా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. బయోసెన్సెస్ విభాగంలో యానిమల్ వ్యాక్సిన్‌తో పాటు మరో 14 ప్రాజెక్ట్స్ కోసం ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు అయోవా యూనివర్సిటీ తెలిపింది.

టెక్నికల్ సంస్థలన్నీ కలిసి పనిచేసినప్పుడే ఇలాంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ పరిశోధనలు బయటికొస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. ఏవైనా రెండు సంస్థల మధ్య సహకారం ఏర్పరచడానికి ప్రత్యేకమైన ఉద్యోగాలు కూడా ఏర్పడ్డాయని వారు అన్నారు. రెండు సంస్థల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పరచడమే ఈ ఉద్యోగంలోని ముఖ్య లక్ష్యం. అలా ఇతర సంస్థలతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ.. వారి పరిశోధనల్లో పాల్గొనడమే అయోవా యూనివర్సిటీ టార్గెట్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News