BigTV English
Advertisement

Samantha:- అల్లు అర్హ బర్న్ సూప‌ర్‌స్టార్‌: స‌మంత‌

Samantha:- అల్లు అర్హ బర్న్ సూప‌ర్‌స్టార్‌: స‌మంత‌

Samantha:- అల్లు ఫ్యామిలీలో అల్లు రామ‌లింగ‌య్య త‌ర్వాత ఆయ‌న న‌ట వార‌సులు ఎవ‌రూ రాలేదు. ఆయ‌న త‌న‌యుడు అల్లు అర‌వింద్ ఆగ్ర నిర్మాత‌గా రాణించారు. అయితే అర‌వింద్ త‌న‌యులు అల్లు అర్జున్‌, శిరీష్ మాత్రం న‌ట‌న‌లోకి అడుగు పెట్టారు. వీరిలో అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అల్లు అర్హ‌.. స‌మంత‌తో గుణ శేఖ‌ర్ రూపొందించిన పాన్ ఇండియా విజువ‌ల్ వండ‌ర్ శాకుంత‌లం చిత్రంలో చిన్ననాటి భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించింది.


రీసెంట్ ఇంట‌ర్వ్యూలో అల్లు అర్హ గురించి స‌మంత మాట్లాడుతూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది. ‘‘అల్లు అర్హ నటనను నేర్చుకోవాల్సిన పని ఏం లేదు. త‌ను బ‌ర్న్ సూప‌ర్‌స్టార్‌. ఎందుకంటే త‌ను శాకుంతం సెట్స్‌లోకి అడుగు పెట్టే తొలి సీన్‌లోనే వంద‌లాది ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్‌, కెమెరాలున్నాయి. అయినా త‌ను వ‌చ్చి త‌ను చెప్పాల్సిన పెద్ద డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పేసి వెళ్లిపోయింది. నేను అది చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. త‌ను చాలా క్యూట్‌గా ఉండేది. త‌న‌ను సెట్స్‌లో చూడ‌గానే తెలియకుండానే చిన్న స్మైల్ వ‌చ్చేసేది. త‌న‌కు ఇంగ్లీష్ రాదు. తెలుగు చాలా చ‌క్క‌గా మాట్లాడుతుంది. బ‌న్నీ, స్నేహ ముందు తెలుగు నేర్పించ‌టం పైనే దృష్టి పెట్టారు. ఇంగ్లీష్ ఎలాగైనా వ‌చ్చేస్తుంది. చ‌దువుకుంటుంటే ఆటోమేటిక్‌గా వ‌చ్చేస్తుంది. కాబ‌ట్టి వాళ్లు చ‌క్క‌టి తెలుగు నేర్పించారు’’ అని అల్లు అర్హ గురించి చెప్పింది సామ్.

దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందింది. ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగా గుణ శేఖ‌ర్ ఈ శాకుంత‌లం సినిమాను రూపొందించారు. ఇందులో దుష్యంత మ‌హారాజుగా మ‌ల‌యాళ యాక్ట‌ర్ దేవ్ మోహ‌న్ న‌టించారు.


2024 ఎల‌క్ష‌న్ టార్గెట్‌.. బాల‌కృష్ణ – బోయ‌పాటి మూవీ(BB4)కి రంగం సిద్ధం

for more updates follow this link:-bigtv

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×