EPAPER

Artificial Intelligence : మార్స్‌పై స్టడీకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిద్ధం..

Artificial Intelligence : మార్స్‌పై స్టడీకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిద్ధం..
Artificial Intelligence

Artificial Intelligence : కృత్రిమ మేధస్సు గురించి ప్రస్తుతం టెక్ ప్రియులు అందరికీ తెలుసు. ఈ కృత్రిమ మేధస్సుతోనే ఎన్నో అద్భుతాలు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం భూమిపైనే కాదు.. స్పేస్ ఇండస్ట్రీలో కూడా ఉపయోగపడుతుందని వారు నిరూపించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఏఐతో స్పేస్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టి తొలి అడుగు వేయనున్నారు.


ఇప్పటికే మార్స్‌పై ప్రయోగాలను వేగవంతం చేశారు శాస్త్రవేత్తలు. భూమిపై వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలు ఏర్పడుతుండడంతో మార్స్‌పై జీవనాన్ని కొనసాగించవచ్చా లేదా త్వరలోనే తెలుసుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. అంతే కాకుండా తాజాగా మార్స్‌పై నీటి ఆనవాళ్లు కూడా కనిపించడంతో వారికి మరింత ప్రోత్సాహం లభించింది. తాజాగా మార్స్‌పై జీవనం గురించి స్టడీ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

కేవలం మార్స్‌లోనే కాదు.. చల్లటి ప్రాంతాల్లో కూడా మానవ జీవనం కొనసాగుతుందా లేదా అన్న విషయంపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పరిశోధనలు చేయనుంది. ఇప్పటికీ దీనికోసం ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన ఏఐ మోడల్‌ను ఆస్ట్రోబయోలజిస్ట్‌లు సిద్ధం చేశారు. దాంతో చిలియన్ అటకామా ఎడారి ప్రాంతంలో ప్రయోగాలు కూడా చేపట్టారు. ఇది భూమిపైన ఎక్కువ ఎండిపోయిన ప్రాంతంగా చెప్పుకోబడుతుంది. దీనిపై జీవనం కొనసాగించవచ్చా లేదా అన్నదానిపై ఏఐ స్టడీ చేసింది.


ఏఐ చేసిన ఈ పరిశోధనలు 87.5 శాతం కరెక్ట్‌గా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీన్ని బట్టి చూస్తే మార్స్‌పై కూడా మానవాలి జీవనం కొనసాగుతుందో లేదో తెలియడానికి ఏఐ ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్స్ గురించి పూర్తిగా స్టడీ చేయడానికి పరిశోధకుల దగ్గర పూర్తిస్థాయి వనరులు లేవు. భూమిపై కాకుండా ఇంక ఎక్కడైన మానవ జీవనం సాధ్యమా అని తెలుసుకోవాలనుకున్న ప్రతీసారి వారికి ఇదే సమస్య ఎదురవుతోంది. ఈ విషయంలో ఏఐ వారికి సాయంగా నిలవనుంది.

కొత్త ఏఐ మోడల్ ఇతర గ్రహాలపై జీవనం కొనసాగించవచ్చా, ఒకవేళ ఆ అవకాశం ఉంటే ఏ ప్రాంతంలో జీవనం కొనసాగించడం సులువుగా ఉంటుంది అన్న విషయాలపై స్టడీ చేసి శాస్త్రవేత్తలకు తెలియజేయనుంది. దీంతో పాటు రోడ్‌మ్యాప్స్ లాంటివి తయారు చేయడానికి కూడా ఇది ఉపయోగపడనుందని తెలుస్తోంది. బయోసిగ్నేచర్స్‌ను కనుక్కునే విషయంలో ఏఐ సాయం కీలకంగా నిలవనుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×